ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయమే లక్ష్యంగా పనిచేయాలి

ABN, First Publish Date - 2022-10-23T17:50:07+05:30

వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు విజయమే లక్ష్యంగా పని చేయాలని టీడీపీ ప్ర కాశం, నెల్లూరు జిల్లాల పరిశీలకుడు బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రేణులకు టీడీపీ ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిశీలకుడు జనార్దన్‌రెడ్డి

దర్శి, అక్టోబరు 22 : వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు విజయమే లక్ష్యంగా పని చేయాలని టీడీపీ ప్ర కాశం, నెల్లూరు జిల్లాల పరిశీలకుడు బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. పీజీఎన్‌ కల్యాణ మండపంలో శనివారం జరిగిన ని యోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమా వేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంచెర్ల శ్రీకాంత్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకునేలా అందరూ శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు. వైసీపీ అరా చక పాలనలో అ న్ని వర్గాల ప్రజలు తీవ్ర అసం తృప్తితో ఉన్నారన్నారు. జగన్‌రెడ్డి ప్రజా, కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను వివ రిస్తూ ఓటర్లను చైతన్యవంతులను చేయాలన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కంచెర్ల శ్రీకాంత్‌ మా ట్లాడు తూ అర్హులైన అందరినీ ఓటర్ల జాబితాలో చేర్పించాలని సూచించారు.

పార్టీ ఇన్‌చార్జిని నియమించాలి

దర్శి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇన్‌చార్జిని నియమించాలని పలువురు నా యకులు సూచించారు. కొద్దికాలం క్రితం వరకు ఇన్‌చార్జిగా పనిచేసిన పమిడి రమేష్‌ అర్ధాంతరంగా మా నుకో వాల్సిన పరిస్థితిని ప్రశ్నించారు. దీనిపై పార్టీ పరిశీ లకుడు మా ట్లాడుతూ ఆయన ఎవరితో సంప్రదించ కుం డానే బాధ్యతల నుంచి తప్పుకున్నారని స్పష్టం చేశారు. మీ అభిప్రాయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామన్నారు. మంచి ఇన్‌చార్జిని నియమిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, రాష్ట్ర టీడీపీ ఆర్గ నైజింగ్‌ కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం చౌదరి, నగర పంచాయతీ చైర్మెన్‌ నారపుశెట్టి పి చ్చయ్య, మాజీ ఎంపీపీ మందలపు వెంకట రావు, టీడీపీ పట్టణ అధ్య క్షుడు యాదగిరి వాసు, దర్శి, దొనకొండ, కురిచేడు, తా ళ్లూరు, ముండ్ల మూరు టీడీపీ అధ్యక్షులు చిట్టే వెంకటేశ్వర్లు, నాగుల పాటి శివ కోటేశ్వ రరావు, నెమలయ్య, బొమ్మిరెడ్డి ఓబుల్‌రెడ్డి, కొర్రపాటి శ్రీనివాసరావు, జిల్లా తెలుగు మహిళా నాయకురాలు ఎం శోభా రాణి, దర్శి నియో జకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు పుల్లలచె రువు చిన్నా, దర్శి ని యోజక వర్గ తెలుగు యువత అధికార ప్రతినిది గుర్రం బాల కృష్ణ, దర్శి పట్టణ టీడీపీ మాజీ అధ్యక్షుడు దారం సుబ్బారావు, నగర పం చాయతీ వైస్‌ చైర్మన్‌ స్టీవెన్‌, మధు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-27T15:42:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising