ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

RYTHU BAROSA: అవును..రైతు భరోసా డబ్బు పడలేదు!

ABN, First Publish Date - 2022-11-02T06:01:57+05:30

‘ఆళ్లగడ్డ నొక్కుడు’పై ఆంధ్రజ్యోతి కథనం అక్షరసత్యమని తేలింది. వైఎస్సార్‌ రైతుభరోసా రెండో విడతకుసంబంధించి 77వేలమందికి సాంకేతిక కారణాలతో చెల్లింపులు నిలిచిపోయినట్లు వ్యవసాయశాఖ స్వయంగా అంగీకరించింది. అక్టోబరు 17న ఆళ్లగడ్డలో సీఎం జగన్‌ బటన్‌ నొక్కినా.. రైతు భరోసా సొమ్ము చాలామంది రైతులకు జమ కాలేదని అక్టోబరు 30న ‘ఆంరఽధజ్యోతి’ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే.

RYTHU BAROSA
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దాదాపు 77 వేల మందికి నిలిచిపోయాయి

సాంకేతిక కారణాలతో ఖాతాలకు చేరలేదు

వెల్లడించిన వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌

మంత్రి కాకాణి బుకాయింపునకు భిన్నంగా ప్రకటన

‘ఆళ్లగడ్డ నొక్కుడు’పై నిజమైన ‘ఆంధ్రజ్యోతి’ కథనం

అమరావతి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ‘ఆళ్లగడ్డ నొక్కుడు’పై ఆంధ్రజ్యోతి కథనం అక్షరసత్యమని తేలింది. వైఎస్సార్‌ రైతుభరోసా రెండో విడతకుసంబంధించి 77వేలమందికి సాంకేతిక కారణాలతో చెల్లింపులు నిలిచిపోయినట్లు వ్యవసాయశాఖ స్వయంగా అంగీకరించింది. అక్టోబరు 17న ఆళ్లగడ్డలో సీఎం జగన్‌ బటన్‌ నొక్కినా.. రైతు భరోసా సొమ్ము చాలామంది రైతులకు జమ కాలేదని అక్టోబరు 30న ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. అయితే.. రైతుభరోసా చెల్లింపులపై వాస్తవాలు తెలుసుకోకుండా రాశారంటూ వ్యవసాయమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సోమవారం మీడియా సమావేశంలో బుకాయించారు. కానీ ఇందుకు భిన్నంగా మంగళవారం వ్యవసాయ అధికారుల ప్రకటన ఉండటం గమనార్హం. ‘‘వివిధ సాంకేతిక కారణాల వల్ల 77వేల మందికి జమ కాలేదు.

రైతు భరోసా సొమ్ము పడని రైతుల జాబితాలను ఆర్బీకేల వారీగా గుర్తించి పంపించాం’’ అని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ హరికిరణ్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో తెలిపారు. ఆధార్‌, బ్యాంక్‌ ఖాతాలను బ్యాంకుల్లో సరిజేసుకునేందుకు రైతులకు గ్రామ వ్యవసాయ, ఉద్యాన సహాయకులు సహకారం అందించాలని అధికారులను ఆదేశించారు. కాగా, పీఎం కిసాన్‌ లబ్ధికి డిసెంబరు నుంచి ఈకేవైసీ తప్పనిసరి కాబట్టి, ఈ ప్రక్రియను ఈనెల 20లోగా పూర్తిచేయాలని సూచించారు. ఈక్రాప్‌ నమోదుపై ఆర్బీకే స్థాయిలో వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి 5,6 తేదీల్లో తహసీల్దారు ధ్రువీకరణతో 7న తుది జాబితాలను ప్రకటిస్తామని వివరించారు.

Updated Date - 2022-11-02T08:14:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising