ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రకృతి సాగు పంటల పరిశీలన

ABN, First Publish Date - 2022-10-27T23:32:32+05:30

మండలంలో సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసా య పంటలను గురువారం ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రతినిధుల బృందం పరిశీలించింది.

ప్రకృతి సాగును పరిశీలిస్తున్న పొరుగు రాష్ట్రాల ప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు

వాల్మీకిపురం, అక్టోబరు 27: మండలంలో సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసా య పంటలను గురువారం ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రతినిధుల బృందం పరిశీలించింది. ప్రకృతి వ్యవసాయ సాగును క్షేత్ర స్థాయిలో పరిశీలించే నిమిత్తం మధ్యప్రదేశ, అస్సాం, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ తదితర రాష్ట్రాలకు చెందిన ప్రతినిధుల బృందం వాల్మీకిపురం మండలంలోని అయ్యవారిపల్లె, వెలగపల్లె తదితర గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రకృతి సాగు పద్ధతిలో పంటలను సాగు చేస్తున్న రైతులు స్వాతి, యల్లారెడ్డి, ఆనంద్‌ల వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. స్వాతి, ఆనంద్‌ తదితరులు 25 సెంట్లలో 22 రకాల కూరగాయలను ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసి ఏడాదికి రూ.94 వేలు ఆదాయం తీసిన వైనాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల అనుభవాలను వారు అడిగి తెలుసుకున్నారు. తమ రాష్ట్రాలలో సైతం ప్రకృతి సాగు తరహా విధానాలను అమలు చేయనున్న ట్లు వారు తెలిపారు. అయ్యవారిపల్లె వెలగపల్లె తదితర గ్రామాల్లోని కిచెన గార్డెన్సను వారు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రతినిధుల బృంద సభ్యులు శ్రావణిరెడ్డి, శ్రీకర్‌, నమ్రత, పవన, అశోక్‌, తిరుపతి డీపీఎం మునిరత్నం, అన్నమయ్య జిల్లా డీపీఎం రమే్‌షబాబు, అడిషనల్‌ డీపీఎం యశోద, రైతు సేవా సంస్థ ప్రతినిధులు స్వాతి, హేమలత, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-27T23:32:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising