ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Penukonda YCP MLA sandals: పెనుకొండ వైసీపీ ఎమ్మెల్యేపైకి చెప్పులు

ABN, First Publish Date - 2022-12-18T03:46:29+05:30

అధికార వైసీపీ ఎమ్మెల్యేపై ఉన్న అసంతృప్తి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సాక్షిగా బట్టబయలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలోనే

వ్యతిరేక వర్గం నిరసన

శంకర నారాయణకు

టికెట్‌ ఇవ్వొద్దని నినాదాలు

హిందూపురం, డిసెంబరు 17: అధికార వైసీపీ ఎమ్మెల్యేపై ఉన్న అసంతృప్తి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సాక్షిగా బట్టబయలైంది. ఆయన ముందే చెప్పులు తీసి ఆయన పక్కనే ఉన్న ఎమ్మెల్యే పైకి ఆ చెప్పులను విసిరిన ఉదంతం పెనుకొండలో చోటు చేసుకుంది. మంత్రి పెద్దిరెడ్డిని చుట్టుముట్టిన ఎమ్మెల్యే అసమ్మతివర్గం ‘ఈ ఎమ్మెల్యే మాకొద్ద’ంటూ నిరసన గళం వినిపించారు. శనివారం శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో వైసీపీ విస్తృస్థాయి సమావేశంలో పాల్గొనేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బయల్దేరారు. ఆయన వస్తున్న విషయం తెలియగానే స్థానిక ఎమ్మెల్యే శంకరనారాయణ వ్యతిరేక వర్గం పెనుకొండ వై జంక్షన్‌ వద్దకు చేరుకుంది. వారంతా అక్కడే రోడ్డుపై బైఠాయించి... ‘శంకర్‌నారాయణ వద్దు.. జగన్‌ ముద్దు.. నాన్‌లోక్‌ వద్దు.. లోకల్‌ ముద్దు’ అని నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు.

అదే సమయంలో మంత్రి పెద్డిరెడ్డికి స్వాగతం పలికేందుకు ఎమ్మెల్యే శంకర్‌నారాయణ కాన్వాయితో సోమందేపల్లివైపు వెళుతూ.. వైజంక్షన్‌ వద్దకు చేరుకున్నారు. దీంతో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా ఎమ్మెల్యే మద్దతుదారులు ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. తర్వాత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌ పెనుకొండ వైజంక్షన్‌కు రాగానే అసమ్మతి నేతలు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి కాన్వాయిని చుట్టుముట్టారు. దీంతో మంత్రి కిందకు దిగి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు వినిపించుకోలేదు. ఎమ్మెల్యే అవినీతిపరుడని, ఆయనకు టికెట్‌ ఇవ్వకూడదని డిమాండ్‌ చేశారు. సహనం కోల్పోయిన పెద్దిరెడ్డి.. వారిని నెట్టేశారు. ఈ సమయంలో ఓ కార్యకర్త తన రెండు చెప్పులను ఎమ్మెల్యే శంకర నారాయణ మీదకు విసిరారు.

వైసీపీ కార్యకర్తపై సొంతపార్టీవారి దాడి

ఎమ్మెల్యే శంకర్‌ నారాయణను విమర్శిస్తూ సోషల్‌ మీడియాలో ఆడియో పోస్టు పెట్టినందుకు సొంత పార్టీ కార్యకర్తపై వైసీపీ నేతలు విచక్షణారహితంగా దాడి చేశారు. గోరంట్లకు చెందిన వైసీపీ నేత శంకర్‌రెడ్డితో పాటు 10 మంది ఈ దాడి చేశారని బాధితుడి కుటుంబం వాపోయింది. శనివారం రాత్రి 7.30 సమయంలో సాదిక్‌ ఇంటికి వీరందరూ వెళ్లారు. ఇంటి వద్ద కూర్చున్న సాదిక్‌ను చావగొట్టారు. పోలీస్‌ స్టేషన్‌ తీసుకెళ్లి అక్కడ కూడా మరోసారి దాడి చేశారు. పోలీసులు విడిపించి, వైసీపీ నాయకులను పంపించేశారు. ‘‘అధికారం ఉంది.. అదే పార్టీలో ఉన్నావు. బుద్ధిగా బతుకు’’ అని సీఐ సుబ్బరాయుడు హితవు పలికి మరీ పంపించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, ఎమ్మెల్యే శంకర నారాయణను విమర్శిస్తూ వాట్సాప్‌ గ్రూప్‌లో సాదిక్‌ ఓ ఆడియో పెట్టాడు. ‘నీకోసం తొమ్మిదేళ్లు కష్టపడ్డా. గెలిచినప్పుడు నా భుజాలమీద మోశా. నీలాంటి చేతగాని దద్దమ్మను నమ్ముకొని ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వారి కష్టాలు, జీవితం నీకు తెలియదా..? వారు ఎలా బతుకుతున్నారో తెలియదా..? నీ దగ్గరకు రావాల్సింది మేం కాదు, నువ్వే కార్యకర్త ఇంటికి వెళ్లాలి. ఓట్లకోసం ఎలా వచ్చావో.. ఇప్పుడు కూడా అలాగే రా..’’ అని నిలదీశాడు.

Updated Date - 2022-12-18T04:01:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising