ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోడువారిన జీవితాలకు ‘వెలుగు’

ABN, First Publish Date - 2022-11-20T22:42:14+05:30

మోడువారిన జీవి తాలకు వెలుగు కార్యాలయం నుంచి బంగారు బాసట లభిస్తోంది. వివిధ కారణాల చేత జైలు శిక్షలు అనుభవించిన కుటుంబాలలో వ్యక్తులను గుర్తించి వారికి సబ్సిడీ లేక నాన్‌ సబ్సిడీ రుణాలతో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రుణ సాయంతో సాగుతున్న కుటుంబాలు

చీరాలటౌన్‌, నవంబరు20 : మోడువారిన జీవి తాలకు వెలుగు కార్యాలయం నుంచి బంగారు బాసట లభిస్తోంది. వివిధ కారణాల చేత జైలు శిక్షలు అనుభవించిన కుటుంబాలలో వ్యక్తులను గుర్తించి వారికి సబ్సిడీ లేక నాన్‌ సబ్సిడీ రుణాలతో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఈక్రమంలో వచ్చే ఆదా యాలతో కుటుంబాలను పోషించుకోవాలని సారా తయారీ, లేక దొంగతనాలు విడనాడాలని అవగా హనలు కల్పిస్తున్నారు. ఈకోణంలో సత్ప్రవర్తన ఉన్న వారికి తప్పక ఆసరా అందిస్తున్నట్లు చెప్తున్నారు. కలె క్టర్‌ విజయకృష్ణన్‌ ఈ అంశాలను స్వయంగా పరి శీలి స్తున్నారు. దీంతో రుణాలు పొందిన వారు నేరుగా దు కాణాలకు థాంక్యూ కలెక్టర్‌ బ్యానర్‌లు పెడుతు న్నారు. ఇప్పటికే వెలుగు వీవోఏల ద్వారా ఈపరమైన జాబి తాను సేకరిస్తున్నారు. కొందరికి ఇప్పటికే రుణ స దుపాయాలు కల్పించి ఉపాధిని ఏర్పాటు చేశారు. అం తేకాకుండా వారానికి ఒకసారి వీరి నుంచి అన్ని వివ రాలను సేకరిస్తున్నారు. ఇదే కనుక క్షేత్రస్థాయిలో కొన సాగితే చీరాల పరిధిలో మంచి వాతావరణం ఏర్పాటు అవుతుందనడంలో సందేహం లేదు.

నా భర్త జైలులో ఉన్నాడు

నిరుపేద కుటుంబం, ముగ్గురు పిల్లలున్నారు. నా భర్త విజయ్‌ సారా తయారు చేస్తూ పట్టుబడి జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు వెలుగు నుంచి రూ.50 వేలు ఇచ్చారు. దీంతో కిరాణా దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాను.

- కొండారెడ్డి దుర్గ, లబ్ధిదారు

కేసు నుంచి బయటకు వచ్చా

భర్త దేవ సహాయం అకస్మాత్తుగా మృతి చెందారు. దీంతో పరి స్థితులు దారుణంగా మారాయి. ఈక్రమంలో తప్పక కుటుంబ పోష ణకు సారా తయారీకు సిద్ధమ య్యాను. ఈక్రమంలోనే కేసులో ఇ రుక్కున్నాను. బయటకు వచ్చాక కలెక్టర్‌ ఆదేశాల మేరకు వెలుగు కార్యాలయం ద్వారా రూ.50 వేలు ఇచ్చారు. ఇంటిలోనే వస్త్ర దుకా ణం ఏర్పాటు చేసుకున్నాను. ఇప్పుడు చాలా సంతోంగా ఉన్నాను.

- వల్లభ చిట్టెమ్మ, లబ్ధిదారు

సత్ప్రవర్తకులకు రుణ సాయం

చాలామంది జీవనోపాధి లేక కుటుంబాలను పోషించు కునేందుకు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో పలువురు జైలు జీవితాలను అనుభ విస్తున్నారు. అటువంటి వారు సత్ప్రవర్తన కలిగివుంటే రుణ సాయం అందించేలా కలెక్టర్‌ ప్రత్యేక చర్యలు తీసు కుంటున్నారు.

- గద్దె సుబ్బారావు, వెలుగు ఏపీఎం, చీరాల మండలం

Updated Date - 2022-11-20T22:42:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising