మెరుగైన వైద్య సేవలందించాలి
ABN, First Publish Date - 2022-11-04T21:54:53+05:30
గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందిచాలని కలెక్టర్ ది నేష్‌కుమార్ సూచించారు.
కలెక్టర్ దినేష్‌కుమార్
పామూరు, నవంబరు 4 : గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందిచాలని కలెక్టర్ ది నేష్‌కుమార్ సూచించారు. మండలంలోని మో పాడు గ్రామంలో కలెక్టర్ శుక్రవారం పర్యటిం చారు. గ్రామంలోని గ్రామ సచివాలయాన్ని ప రిశీలించారు. అనంతరం సచివాలయంలో ఏ ర్పాటు చేసిన విలేజ్ హెల్త్ క్లినిక్ శిబిరాన్ని పరి శీలించారు. ఫ్యామిలీ ఫిజీషియన్ ప్రోగాం గు రించి, సిబ్బందిని అడిగి తెలుసుకొన్నారు. ప్రభు త్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫ్యా మిలీ ఫిజీషియన్ పోగ్రాంను వైద్యశాఖ సి బ్బం ది విజయవంతం చేయాలన్నారు. ప్రజల ఆరో గ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసు కోవా లన్నారు. దాతలు, ప్రజాప్రతినిధుల సహకా రం తో క్లినిక్ పనులను త్వరితిగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకు రావాలని, ఎం పీపీ గంగసానిలక్ష్మి, జడ్పీటీసీ సభ్యుడు చప్పిడి సు బ్బయ్యలకు, సూచించారు. సచివాలయ సి బ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సమ స్యలు పరిష్కారించాలన్నారు. తహసీల్దార్ కా ర్యాలయంలో వీఆర్వో కొరతను తెలపగా పెద్ద మండలంలో వీఆర్వో భర్తీకి చర్యలు తీసుకో వాలని ఆర్డీవో సంపత్ కుమార్‌కు ఆదేశించారు. అసైన్డ్ గ్రామసభల సందర్భంగా గ్రామాల్లో ముందస్తుగా దండోరా వేయించాలని, భూమి లేని నిరుపేదల చేత దరఖాస్తులు తీసుకోవా లని తహసీల్దార్ ప్రసాద్‌కు ఆదేశించారు. సమావేశంలో ఎంపీడీవో వీ శ్రీనివాసులు, ఎం ఈవో రవీంద్రనాథ్, ఈవోపీఆర్డీ వీ బ్రహ్మానం దరెడ్డి, సర్పంచ్ చప్పిడి వరలక్ష్మి, డాక్టర్లు, హరి బాబు, సాయి పూజాత, ఏఈలు పౌల్‌రాజు, రామకృష్ణ, ఆర్‌ఐ ప్రవీణ్‌కుమార్, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
వర్షంతో కుదించిన పర్యటన
మండల పర్యటనకు వర్షం అడ్డంకిగా మా రింది. దీంతో పలు గ్రామాల్లో జరగాల్సిన ఆయన కార్యక్రమాలు రద్దయ్యాయి. బొట్ల గూడూరులోని సచివాలయంతోపాటు జడ్పీ ఉ న్నత పాఠశాలలో, లక్ష్మీనరసాపురం నాడునేడు పనులు, చిలకపాడు, గుమ్మలంపాడులోని జగ నన్న కాలనీని పరిశీలించాల్సి ఉండగా, వర్షంతో కలెక్టర్ పర్యటన రద్దయింది.
Updated Date - 2022-11-04T21:54:55+05:30 IST