ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ బేస్‌బాల్‌కు ఎంపికైన దొనకొండ విద్యార్థులు

ABN, First Publish Date - 2022-10-25T22:28:46+05:30

జాతీయ స్థాయి బేస్‌బాల్‌ పోటీలకు దొనకొండ జడ్పీ పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు హెచ్‌ఎం రామాంజనే యులు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంపికైన విద్యార్థులతో ఎంఈవో, హెచ్‌ఎం

దొనకొండ, అక్టోబరు 25 : జాతీయ స్థాయి బేస్‌బాల్‌ పోటీలకు దొనకొండ జడ్పీ పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు హెచ్‌ఎం రామాంజనే యులు తెలిపారు. ఈనెల 23, 24 తేదీల్లో బేస్‌బాల్‌ అసోసియేషన్‌ నేతృత్వంలో మూడవ రాష్ట్ర స్థాయి పొటీలు సింగరాయకొండలో నిర్వ హించారు. ఈ పోటీల్లో ప్రకాశం జిల్లా తరుపున సబ్‌ జూనియర్స్‌ విభాగంలో దొనకొండ జడ్పీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న అన్నెం గురుకృష్ణ, 8వ తరగతి చదువుతున్న బొరిగొర్ల చంద్రశేఖర్‌ పాల్గొని రన్నర్స్‌గా గెలుపొంది నేషనల్‌ స్థాయి పోటీల్లో పాల్గొనేందకు ఎంపి కయ్యారు. వీరిద్దరు నవంబర్‌ 4వ తేదీ నుంచి పంజాబ్‌లో నిర్వహించే నేషనల్‌ స్థాయి బేస్‌ బాల్‌ పోటీల్లో పాల్గొంటున్నారని తెలిపారు. నేషనల్‌కు ఎంపికైన జిల్లాకు చెందిన క్రీడాకా రులకు దొనకొండ జడ్పీ పాఠశాల మైదానంలో వారం రోజులు శిక్షణ ఇస్తారని చెప్పారు. పాఠశాల విద్యార్థులు నేషనల్‌ స్థాయికి ఎంపిక య్యేలా ప్రోత్సహించిన వ్యాయమ ఉపాధ్యా యులు కె.నరసింహారావు, డి శ్రీనివాస రావు లను, గెలుపొందిన విద్యార్థులను ఎంఈవో సాంబశివరావు, హెచ్‌ఎంలు రామాంజనేయులు, టి.కోటిరెడ్డి, కటారు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.

Updated Date - 2022-10-25T22:28:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising