ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

ABN, First Publish Date - 2022-11-26T21:59:04+05:30

భారతదేశంలోని అన్నీ వర్గాల ప్రజలకు ఆమోద యోగ్యమైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్‌ బీఆర్‌ అంబే డ్కర్‌ అని డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి పేర్కొన్నారు.

అంబేడ్కర్‌ విగ్రహం వద్ద దర్శి డీఎస్పీ ప్రతిజ్ఞ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దర్శి, నవంబరు 26 : భారతదేశంలోని అన్నీ వర్గాల ప్రజలకు ఆమోద యోగ్యమైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్‌ బీఆర్‌ అంబే డ్కర్‌ అని డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి పేర్కొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఎంపీడీవో కార్యాలయ ఆవరణలోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. దళితసేన, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మా ట్లాడుతూ ప్రజలందరూ రాజ్యాంగ ఫలాలను అందుకొవాలన్నారు. కార్యక్ర మంలో సీ ఐ రామకోటయ్య, ఎంపీడీవో కుసుమకుమారి, ఎంఈవో రఘు రామయ్య, డిప్యూటీ తహసీల్దార్‌ రవిశంకర్‌, ఎస్‌ఐ రామకృష్ణ, దళిత ప్రజా సంఘాల నాయకులు కె మార్కు, జీ ప్రేమ్‌కుమార్‌, అన్నవరపు వెంకటే శ్వర్లు, జీ ప్రసాద్‌, నాగమణి పాల్గొన్నారు.

తాళ్లారులో..

తాళ్లూరు : రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని మండలంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో కార్యాయలం వద్ద ఎంపీడీవో కె.యుగకీర్తి అంబేడ్కర్‌, గాంధీజీ, నెహ్రూ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అందరూ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు యామర్తి ప్రభుదాసు, ఎంఈవో సుబ్బయ్య, ఏపీఎం దేవరాజ్‌, ఈవోఆర్డీ ప్రసన్నకుమార్‌ పాల్గొన్నారు. బొద్దికూరపాడు సచివాలయం, గ్రంథాలలో సర్పంచ్‌ మందాశ్యాంసన్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ పులి ప్రసాద్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు బాలకోటయ్య పాల్గొన్నారు.

రాజ్యాంగంపై అవగాహన ఉండాలి : జడ్జి భరత్‌చంద్ర

కనిగిరి : రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కల్గి ఉండాలని కనిగిరి జూనియర్‌ సివిల్‌ జడ్జి కె.భరత్‌చంద్ర అన్నారు. కోర్టులో రాజ్యాం గ దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్బంగా జడ్జి మాట్లాడు తూ రాజ్యంగంలోని పీఠిక, ప్రాథమిక హక్కులు, సూత్రాలు, బాధ్యతలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరూ వరకట్న నిర్మూ లనకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు సి బ్బంది, పారా లీగల్‌ వలంటీర్లు పాల్గొన్నారు.

అంబేడ్కర్‌ ఆశయ సాధనకు ప్రతి పౌరుడు పాటుపడాలని ఎమ్మెల్యే మధుసూదన్‌యాదవ్‌ అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా ని ర్వహించారు. పట్టణంలోని ఒంగోలు బస్టాండ్‌ సెంటరులో అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అంతకముందు పార్టీ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ గఫార్‌, జడ్పీటీసీ సభ్యుడు కస్తూరిరెడ్డి, ఎంపీపీ దంతలూరి ప్రకా శం, రంగనాయకులరెడ్డి, సాల్మన్‌రాజు, సంగు సుబ్బారెడ్డి, పిల్లి లక్ష్మీనారా యణరెడ్డి, మాణిక్యరావు, మోహన్‌రెడ్డి, వేల్పుల వెంకటేశ్వర్లు యాదవ్‌, మురళీయాదవ్‌, పెన్నా ఏడుకొండలు యాదవ్‌, కౌన్సిలర్లు తమ్మినేని సుజాత, దేవకి రాజీవ్‌, శ్రీరాం సతీష్‌, దేవరాజ్‌, కోఅప్షన్‌ సభ్యులు శ్రీని వాసులుయాదవ్‌, బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు. మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ డీవిఎస్‌ నారాయణరావు అధికారులు, సిబ్బదితో ప్రతిజ్ఞ చే యించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మేనేజర్‌ ప్రసాద్‌, టీపీఎస్‌ వివేకా నందకుమార్‌, పూర్ణిమ, పద్మ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ప్రిన్సిపాల్‌ రమణారెడ్డి ఆధ్వర్యంలో రా జ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్‌సీసీ యూనిట్‌ ఆఫీసర్‌ సురేష్‌రెడ్డి, జేవీవీ గయాజ్‌, లెక్టర్లు డీ గురవయ్య, రామ్మోహన్‌, ఏసయ్య, కోటి, నాగమణి, పాల్గొన్నారు.

Updated Date - 2022-11-26T21:59:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising