పేదల ఇళ్ల స్థలాల భూముల కోసం వేట
ABN, First Publish Date - 2022-12-25T00:29:07+05:30
ఒంగోలు నగర పరిధిలోని పేదల కు నివేశస్థలాలు పంపిణీ చేసేందుకు అవసరమైన భూముల కోసం అధి కారులు వేట సాగిస్తున్నారు. ఇందుకోసం ఐదుగురు తహసీల్దార్లు బృం దంగా ఏర్పడి భూములను పరిశీలిస్తున్నారు.
ఐదురుగు తహసీల్దార్లతో బృందం ఏర్పాటు
సంక్రాంతి నాటికి కొంతమందికి అయినా పంపిణీకి నిర్ణయం
ఒంగోలు(రూరల్), డిసెంబరు 24: ఒంగోలు నగర పరిధిలోని పేదల కు నివేశస్థలాలు పంపిణీ చేసేందుకు అవసరమైన భూముల కోసం అధి కారులు వేట సాగిస్తున్నారు. ఇందుకోసం ఐదుగురు తహసీల్దార్లు బృం దంగా ఏర్పడి భూములను పరిశీలిస్తున్నారు. శనివారం జేసీ అభిషిక్త్‌కిషో ర్ మల్లేశ్వరపురం గ్రామ భూములను సందర్శించారు. కాగా యరజర్ల కొండపై 23వేలమందికి ఇళ్ల స్థలాలు కేటాయించారు. దీనిపై కోర్టులో కే సులు ఉండడం, ఇప్పట్లో పరిష్కారం అయ్యే పరిస్థితి లేకపోవటంతో తి రిగి పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అధికారులు మరోచోట భూములు కోసం వెతుకుతున్నారు. కరవది పరిధిలో కొండపి తహసీల్దార్ శింగారా వు, కొత్తపట్నం మండలం అల్లూరు పరిధిలో అక్కడి తహసీల్దార్ రమణా రావు, మల్లేశ్వరపురం పరిధిలో ఒంగోలు తహసీల్దార్ మురళి, ఇక సర్వేరె డ్డిపాలెం పరిధిలో చీమకుర్తి తహసీల్దార్ మధుసూదనరావు, నర్సాపురంఅ గ్రహారం పరిధిలో భూముల పరిశీలనకు టంగుటూరు తహసీల్దార్ కె.చి రంజీవిని కేటాయించారు. వారితో పాటు ఐదుగురు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్లు, ఐదుగురు మండల సర్వేయర్లతో పాటు అదనంగా గ్రామ సర్వేయర్లు ఈ పనిలో నిమగ్నమయ్యారు. మొత్తం 600 ఎకరాలు సేకరించనున్నారు. ఇం దుకోసం రైతులతో మాట్లాడుతున్నారు. ఉన్నతాదికారుల ఆదేశాల మేరకు వచ్చే సంక్రాంతి పండగనాటికి కొంతమందికి అయినా నివేశస్థలాలు కేటా యించేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ స్థలాలు ఇచ్చి వచ్చే ఎన్నిక ల్లో లబ్ధి పొందే ఆలోచనతో పాలకులు ఉన్నట్లు సమాచారం.
Updated Date - 2022-12-25T00:29:15+05:30 IST