ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చినుకు పడితే చర్చిలోనే పాఠాలు

ABN, First Publish Date - 2022-11-01T22:59:50+05:30

నాడు - నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చేస్తున్నాం. స్కూళ్లల్లో మౌ లిక సదుపాయాలు కల్పిస్తున్నామని వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది.

భవనంపై చెట్లు మొలకెత్తడంతో బీటలు వాలిన గోడలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చర్చిలో పాఠాలు చెప్తున్న ఉపాధ్యాయుడు

పీసీపల్లి, నవంబరు 1 : నాడు - నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చేస్తున్నాం. స్కూళ్లల్లో మౌ లిక సదుపాయాలు కల్పిస్తున్నామని వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. అయితే అది కొన్ని పాఠశా లలకే పరిమితమన్న విషయం ఈ పాఠశాలను చూస్తే అర్థమవుతుంది. నాడే-నేడు పథకం కొన్ని గ్రామాల్లోని పాఠశాలలకు నేటికీ వర్తించక పోవడం దురదృష్టం. దీంతో పాతకాలం పాఠశాలలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయి. ఎప్పుడు కూలి పోతాయో తెలియనివి కొన్నయితే, మరికొన్ని ఎండొచ్చినా, వాన పడినా బడిలో ఉండే ప రిస్థితి లేదు. వానా కాలంలో చదువుకు సెల వు చెప్పకతప్పని పరిస్థితి ఉంది. నేరేడుపల్లి గ్రామంలోని ఎస్సీ ప్రాథమిక పాఠశాలలో చినుకు పడితే కారిపోతుంది. దీంతో పక్క నున్న చర్చిలోకి తీసుకెళ్లి పాఠాలు బోధిస్తామని ఉపాధ్యాయులు తెలిపారు. పాఠశాల భవనం పైకప్పు పగుళ్లు ఇచ్చి ప్రమాదకరంగా మా రిందని, ఈ విష యాన్ని పలుమార్లు అధికా రుల దృష్టికి తీసు కువెళ్లినా వారు పట్టించు కోలేదని నేరేడుపల్లి ఎస్సీ కాలనీవాసులు ఆరో పిస్తున్నారు. ఈ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు 8 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఆ పాఠశాల భవనం దశాబ్దాల కాలం నాడు ని ర్మించడంతో పైకప్పు, గోడలకు పగుళ్లు ఏర్ప డ్డాయి. చిన్నపాటి చినుకులు పడినా పైకప్పు, గోడల నుంచి నీరు చెమ్మవిడుస్తున్నాయి. పాఠశాల భవనం గోడలపై చెట్లుకూడా మొలకెత్తాయి. వాటివేర్లు గోడల్లోకి దిగడంతో గోడలు బీటలు వాలాయి. వర్షాలు ఎక్కువైతే పాఠశాల భవనం కూలుతుందేమోనని విద్యార్థుల తల్లి దండ్రులు ఆందోళన చెందుతున్నారు. వర్షానికి నాని పైకప్పు పెచ్చులూడి విద్యార్థులపై పడతాయేమోనన్న భ యంతో ఉపాధ్యాయులు పిల్లలను పక్కనున్న చర్చి వద్దకు తీసుకెళ్లి పాఠాలు చెప్తున్నారు. ఇప్పటికైనా పాఠ శాలను నిర్మించాలని తల్లిదండ్రులు, గ్రామస్థులు కోరుతున్నారు.

గ్రామస్థుల సూచనతోనే చర్చిలో పాఠాలు

వర్షం పడితే పైకప్పు నుంచి నీరు చి మ్ముతోంది. గోడలు పగుళ్లిచ్చాయి. పైకప్పు పె చ్చులూడి పడే ప్రమాదముంది. వానలు పడి నప్పుడల్లా తరగతుల నిర్వహణ ఇబ్బందిగా మారుతుంది. గ్రామస్థుల సూ చనల మేరకు పక్క నున్న చర్చిలో పిల్లలకు పాఠాలు చెప్తున్నాం.

- కోటేశ్వరరావు, ఉపాధ్యాయుడు

కొత్త భవనం నిర్మించాలి

శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాన్ని తొలగించి, కొత్త భవనాన్ని నిర్మించాలి. నాడు నేడు ద్వారా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్తున్నా మా పాఠశాలకు ఆ పథకాన్ని వర్తింప చేయక పోవడం దురదృష్టకరం. భవ నం ఎప్పుడు కూ లుతుందో తెలియని పరిస్థితి ఉంది. ముందుగానే చర్యలు తీసు కోవడం ద్వారా ప్రమాదాలు కాకుండా ఉంటాయి.

- సాల్మన్‌, గ్రామస్థుడు

Updated Date - 2022-11-01T22:59:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising