ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలో మినీ డంపింగ్‌ షెడ్లు

ABN, First Publish Date - 2022-10-25T22:12:09+05:30

జిల్లాలో అవసరమైన అన్ని ప్రాంతాల్లో మినీ డంపింగ్‌ షెడ్లను త్వరలో నిర్మించనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి జీవీ నారాయణరెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీపీవో నారాయణరెడ్డి

దొనకొండ, అక్టోబరు 25 : జిల్లాలో అవసరమైన అన్ని ప్రాంతాల్లో మినీ డంపింగ్‌ షెడ్లను త్వరలో నిర్మించనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి జీవీ నారాయణరెడ్డి తెలిపారు. మండలంలోని ఆరవళ్లిపాడు, పెద్దన్నపాలెం గ్రామాల్లోని డంపింగ్‌ యా ర్డులను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ కలెక్టర్‌ ఆదేశాల మేరకు ప్రతి మంగళ, శుక్రవారాల్లో జిల్లాలోని ప్రతి మం డలాన్ని ఒక అధికారి సందర్శించి స్వచ్ఛసంకల్పంలో భాగంగా సీజనల్‌ వ్యాధులు, దో మల ఉత్పత్తి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో ప్రజలు ఇంటిలోని చెత్తను ఇంటివద్దనే తడిచెత్తను, పొడి చెత్తను వేరుగావేరుగా వేస్తే పొడి చెత్త ద్వారా ప్లాస్టిక్‌, అట్టముక్కలు అమ్ముకోవడం, తడి చెత్త ద్వారా రైతులకు ఉప యోగపడేలా వానపాములతో ఎరువును తయారు చేయడం ద్వారా పంచాయతీల కు ఆదాయం చేకూరుతుందన్నారు. గ్రామాల్లో చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయ కుండా అవసరమైన గ్రామాల్లో మినీ షెడ్లు ఏర్పాటు చేసి అక్కడ చెత్తను డంప్‌ చేసి వారానికి తరలించేలా చర్యలు చేపట్టబోతున్నామన్నారు. జిల్లాలో మోడల్‌, చూడ చక్కని గ్రామాలుగా తీర్చదిద్దటమే ధ్యేయంగా కలెక్టర్‌ ముందుకు సాగుతున్నా రన్నారు. పేదల నిర్మాణ లబ్ధిదారులు డిసెంబరు 20 నాటికి నిర్మాణాలు పూర్తి చేసే లా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. అనంతరం గ్రామాల్లో విస్తృతంగా పర్య టించి పారిశుధ్య నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిబ్బందికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎస్‌ఎండీ దావూద్‌, ఇన్‌చార్జి ఈవోఆర్‌డీ పొట్ల కృష్ణమూర్తి, గ్రామ కార్యదర్శి పి ఎల్లబాబు, పి ధనలక్ష్మీ, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-10-25T22:12:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising