ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అవి కనికట్టు కాలనీలు’

ABN, First Publish Date - 2022-11-18T22:57:23+05:30

జగన్‌ కాలనీలన్నీ కనికట్టుగా ఉన్నాయని, ప్రభుత్వం ప్రచారం చేసుకునే వీడియోల్లో మాదిరిగా నిర్మాణాల పరిస్థితి లేదని టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి విమర్శించారు. పట్టణానికి 7కి.మీటర్ల దూరంలో నింబోడు కొండ దిగువన వేసిన జగన్‌కాలనీలను డాక్టర్‌ ఉగ్ర శుక్రవారం సందర్శించారు.

12లక్షలు ఖర్చు అవుతుందని ఉగ్రకు వివరిస్తున్న లబ్ధిదారుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగన్‌ కాలనీలను సందర్శించిన డాక్టర్‌ ఉగ్ర

ఒక్కో ఇంటికి రూ.12లక్షలు ఖర్చవుతుందని వివరించిన లబ్ధిదారులు

కేవలం 1లక్ష 80వేలతో ఇల్లు ఎలా అవుతుందన్న డాక్టర్‌ ఉగ్ర

కేంద్రం నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వమూ కేటాయించాలని డిమాండ్‌

కనిగిరి, నవంబరు 18 : జగన్‌ కాలనీలన్నీ కనికట్టుగా ఉన్నాయని, ప్రభుత్వం ప్రచారం చేసుకునే వీడియోల్లో మాదిరిగా నిర్మాణాల పరిస్థితి లేదని టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి విమర్శించారు. పట్టణానికి 7కి.మీటర్ల దూరంలో నింబోడు కొండ దిగువన వేసిన జగన్‌కాలనీలను డాక్టర్‌ ఉగ్ర శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీలో ఇంటి నిర్మాణం చేపట్టిన లబ్ధిదారుడితో ఉగ్ర మాట్లాడారు. దాదాపూ రూ.12లక్షలు ఖర్చయిందని, ప్రభుత్వం కేవలం 1లక్షా 80వేల రూపాయలు మాత్రమే ఇస్తుందని తెలిపారు. ఈ కోవలోనే ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం నుంచి ఎంత మంజూరయిందని అసంపూర్తిగా ఉన్న నిర్మాణానికి చెందిన ఓ లబ్ధిదారుడిని ఉగ్ర అడిగారు. నిర్మాణ భారం పెరగడంతో అప్పులు పాలై పూర్తి చేయలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. పేదోడి గూడు అంటూనే వారిని అప్పుల ఊబిలో కి నెట్టేలా జగన్‌ కాలనీలు ఉన్నాయని ఉగ్ర మండిపడ్డారు. ప్రారంభంలో ఉన్న నీటి ట్యాంకులన్నీ పగిలి పోయి ఉండటాన్ని గుర్తించారు. అదేవిధంగా కాలనీ సమీపంలో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న కుటుంబాలను ఉగ్ర పలుకరించారు. అట్టహాసంగా ప్రారంభించిన ప్రభుత్వం కాలనీల్లో మౌలిక వసతులు కల్పించటంలో విఫలమైందని విమర్శించారు. లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం నిధులను ఇస్తుంటే తామేదో మేలు చేసినట్లుగా జగన్‌రెడ్డి, వైసీపీ నాయకులు ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవాచేశారు. లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా కేటాయించాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ హయాంలో టిడ్కో ఇళ్లను పటిష్టంగా పేరొందిన కంపెనీ ద్వారా నిర్మించి పూర్తి దశలోకి వస్తే వాటిని లబ్ధిదారులకు కేటాయించకుండా కావాలనే కాలయాపన చేస్తున్నారన్నారు. ప్రజలు వైసీసీ అరాచక పాలనను గమనిస్తున్నారని, తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గర పడిందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాచమల్ల శ్రీనివాసులరెడ్డి, చిరంజీవి, తమ్మినేని శ్రీనివాసులరెడ్డి, గాయం తిరుపతిరెడ్డి, అచ్చాల రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-18T22:57:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising