ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఆర్‌సీ బకాయిలు వెంటనే చెల్లించాలి: యూటీఎఫ్‌

ABN, First Publish Date - 2022-11-30T23:34:10+05:30

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, కార్మికులకు రావాల్సిన పీఆర్‌సీ, పీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐసీ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ యూటీఎఫ్‌ నాయకులు బుధవారం రాత్రి స్థానిక అంబేడ్కర్‌ సర్కిల్‌లో ఆందోళన చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కదిరి అర్బన, నవంబరు 30 : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, కార్మికులకు రావాల్సిన పీఆర్‌సీ, పీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐసీ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ యూటీఎఫ్‌ నాయకులు బుధవారం రాత్రి స్థానిక అంబేడ్కర్‌ సర్కిల్‌లో ఆందోళన చేపట్టారు. న్యాయబద్ధంగా రా వాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. బకాయిల సాధన కోసం యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో చలో విజయవాడ ధర్నాకు పిలుపునిస్తే ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని అణచివేసేందుకు ఉద్యోగులను అక్రమంగా అరెస్టు చేసిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రావాల్సిన బకాయిలను అందించాలని, లేకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ నా యకులు తాహేర్‌ అలీ, ఖాజామొహిద్దీన, రమణానాయక్‌, రమేష్‌బాబు, వేణుగోపాల్‌, మహబూబ్‌బాషా, భార్గవ్‌, కిశోర్‌, తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయులకు బోధనేతర పనులు వద్దు : ఎస్‌టీయూ

నంబులపూలకుంట, నవంబరు 30: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు పూర్తిగా బోధనేతర పనులు రద్దు చేయాలని ఎస్‌టీ యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హరిప్రసాద్‌రెడ్డి, జిల్లా గౌరవాధ్యక్షుడు రామాంజుల యాదవ్‌ బుధవారం ఓప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బోధనేతర విధులైన ఎన్నికలు, జనాభాలెక్కల గణన విధులకు ఉపాధ్యాయులను దూరం చేస్తూ గెజిట్‌ విడుదల చేయడాని పూర్తిగా ఆహ్వానిస్తున్నామన్నారు. అయితే ప్రస్తుతం ఉపాధ్యాయులు నిత్యం పాఠ శాలలో సతమతమవుతున్న కార్యక్రమాలైన మరుగుదొడ్లు, మధ్యా హ్నభోజనం ఆప్‌లోడ్‌, జగనన్న విద్యాకానుక, షూ కొలతలు, నాడు - నేడు పనులు, అమ్మ ఒడి, కోడిగుడ్లు, చిక్కీలు, బియ్యం లెక్కలు, మా ర్కుల ఆప్‌లోడ్‌ వంటి బోధనేతర పనుల నుంచి మినహాయిస్తూ ఉత్త ర్వులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వృత్తి నిర్వాహణతో సంబంధంలేని బోధనేతర పనులలో వచ్చే సమస్యలకు ఉపాధ్యాయులను బాధ్యులుగా చేస్తూ సస్పెండ్‌ చేయడాన్ని ఆపాలన్నారు. ఉపాధ్యాయులను పూర్తిగా బో ధనకే పరిమితం చేయాలని కోరారు. ప్రతి ఉన్నత,, ప్రాథమిక పాఠశాలలో బోధనేతర పనులు చేయడానికి కంప్యూటర్‌ ఆపరేటర్లను నియమించి, ఉపాధ్యాయుల బోధన సమయాన్ని పెంచాలన్నారు. ప్రభుత్వం వివిధ యాప్‌లను ఉపాధ్యాయులను మానసిక క్షోభనుంచి రక్షించాలన్నారు.

Updated Date - 2022-11-30T23:34:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising