న్యాయం చేయాలంటూ నిరసన
ABN, First Publish Date - 2022-10-27T00:09:13+05:30
తమ పిల్లలపై కొంతమంది ఉద్దేశ పూ ర్వకంగానే కేసు పెట్టారని, తమకు న్యాయం చేయాల ని పట్టణంలోని యాతవీధికి చెందిన పలువురు తల్లి దండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధ వారం వారంతా స్థానిక జాతీయ రహదారిపై బైఠా యించి రాస్తారోకో నిర్వహించారు.
సాలూరు: తమ పిల్లలపై కొంతమంది ఉద్దేశ పూ ర్వకంగానే కేసు పెట్టారని, తమకు న్యాయం చేయాల ని పట్టణంలోని యాతవీధికి చెందిన పలువురు తల్లి దండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధ వారం వారంతా స్థానిక జాతీయ రహదారిపై బైఠా యించి రాస్తారోకో నిర్వహించారు. యాతవీధికి చెంది న రమణ తదితరులు తెలిపిన వివరాల మేరకు... పట్టణంలో 29వ వార్డుకు చెందిన యాతవీధిలో దీ పావళి రోజున కొంతమంది యువకులు తమ ఇంట్లోకి బాంబులు వేస్తున్నారని అదే వీధికి చెందిన బుజ్జి, హర్ష డయల్ 100 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో ప ట్టణ పోలీసులు టెంకి లక్ష్మ ణ, హేమంత్, రాము, గొడ్డు గణేష్, చుక్క గణేష్, పవన్ తదితరులను బుధ వారం స్టేషన్‌కు పిలిపించా రు. అయితే తమ పిల్లలు ఎవరిని ఇబ్బంది పెట్టలేద ని, కావాలని ఫిర్యాదు చేశా రని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పట్ట ణ ఎస్‌ఐ పాపారావు, రూరల్ ఎస్‌ఐ ప్రయోగమూర్తి తో పాటు పోలీసు సిబ్బంది అక్కడకు చేరుకోని బాధి తులతో మాట్లాడారు. విచారణ చేసి న్యాయం చేస్తామ ని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించుకున్నారు.
Updated Date - 2022-10-27T00:09:15+05:30 IST