ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rain: అల్పపీడనం.. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు

ABN, First Publish Date - 2022-11-16T20:07:55+05:30

దక్షిణ అండమాన్‌ సముద్రం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం బుధవారం నాటికి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో గురువారంకల్లా అల్పపీడనం ఏర్పడనున్నది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: దక్షిణ అండమాన్‌ సముద్రం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం బుధవారం నాటికి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో గురువారంకల్లా అల్పపీడనం ఏర్పడనున్నది. అల్పపీడనం (low pressure) తరువాత రెండు రోజులు పశ్చిమ వాయువ్యంగా పయనించే క్రమంలో వాయుగుండంగా బలపడి దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించనున్నది. అనంతరం పశ్చిమ వాయువ్యంగా పయనించి ఈనెల 21 లేదా 22వ నాటికి ఉత్తర తమిళనాడు తీరానికి దగ్గరగా రానున్నదని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఈనెల 19వ తేదీ నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు ప్రారంభమవుతాయని పేర్కొంది. కాగా బుధవారం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొనగా...అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమ (Rayalaseema)లో పొడి వాతావరణం నెలకొంటుందని వివరించింది. ఇదిలావుండగా ఉత్తర కోస్తాలో చలి తీవ్రత పెరగడంతో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. బుధవారం కళింగపట్నంలో 16.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

Updated Date - 2022-11-16T20:07:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising