జేమ్స్ బాండ్‌గా రామ్‌చరణ్?
ABN, First Publish Date - 2022-07-29T10:13:15+05:30
జేమ్స్ బాండ్‌గా రామ్‌చరణ్?
హైదరాబాద్, జూలై 28 (ఆంధ్రజ్యోతి): ‘జేమ్స్ బాండ్’... ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానుల్ని అలరించిన పాత్ర. అలాంటి పాత్రలో ఓ తెలుగు నటుడు కనిపిస్తే..? అంతకంటే అద్భుతం ఏముంటుంది? ఈ అవకాశం రామ్‌చరణ్‌ని వరించే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. ఆ పాత్రని సృష్టించిన చియో హోదారి కోకర్ ఇప్పుడు రామ్ చరణ్‌ని జేమ్స్ బాండ్ పాత్రకు అన్ని విధాలా అర్హుడని ట్వీట్ చేయడం ఆసక్తిగా మారింది. ‘నో టైమ్ టు డై’లో డానియల్ క్రేగ్ జేమ్స్ బాండ్‌గా నటించిన సంగతి తెలిసిందే. డానియల్ తరవాత జేమ్స్ బాండ్ ఎవరు? అనే చర్చ హాలీవుడ్‌లో వాడీ వేడిగా నడుస్తోంది. ఈ సందర్భంగా చియో ఓ ట్వీట్ చేశారు. అందులో జేమ్స్ బాండ్ పాత్రని సమర్థంగా పోషించగల సత్తా ఉన్న నటుల్లో రామ్ చరణ్ ఒకరని పేర్కొనడం గమనార్హం. చరణ్‌తో పాటు మరో ముగ్గురు నటుల పేర్లు కూడా ఆయన ప్రస్తావించారు. సోపే దిరుసు, మాథ్యూ గూడే, డామన్ ఇద్రిస్ పేర్లని సూచించారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. చియో ట్వీట్ చేసిన వెంటనే.. ‘జేమ్స్ బాండ్ పాత్రకు చరణ్ అన్ని విధాలా అర్హుడు’ అంటూ చరణ్ అభిమానులు రీ ట్వీట్లు చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా చూస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు చియో ట్వీట్ చేశారు. ఆయన మాటే నిజమైతే... తెలుగు ప్రేక్షకులకు అంతకంటే కావల్సిందేముంది?
Updated Date - 2022-07-29T10:13:15+05:30 IST