వృద్ధుడి ఆవేదనను పట్టించుకోని రోజా
ABN, First Publish Date - 2022-06-13T23:05:39+05:30
తనకు ఫెన్షన్ రాలేదని ఓ వృద్ధుడు మంత్రి రోజు ఎదుట వాపోయాడు. అయినా ఆ వృద్ధుడి ఆవేదనను పట్టించుకోకుండామంత్రి వెళ్లిపోయారు.

ఆత్మకూరు: తనకు పెన్షన్ రాలేదని ఓ వృద్ధుడు మంత్రి రోజా ఎదుట వాపోయాడు. అయినా ఆ వృద్ధుడి ఆవేదనను పట్టించుకోకుండా మంత్రి వెళ్లిపోయారు. తనకు పెన్షన్ రాలేదని చెబుతున్నా మంత్రి చూసిచూడనట్లుగా వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా పెళ్లూరులో మంత్రి రోజా పర్యటించారు. రోజా ప్రసంగిస్తున్న సమయంలో 70 ఏళ్ల వృద్ధుడు తన గోడును వినిపించేందుకు ప్రయత్నించాడు. 9 నెలలుగా తన పెన్షన్ ఆపేశారని వాపోయాడు. వాలంటీర్ తనపై కక్ష కట్టి పెన్షన్ రాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆ వృద్ధుని స్థానిక వైసీపీ నేతలు అడ్డుకున్నారు. వృద్ధుడి చూసినట్లు వ్యవహరించడంపై రోజాపై స్థానికులు మండిపడ్డారు. తాను వైసీపీకి రెండు సార్లు ఓటేశానని సదరు వృద్ధుడు తెలిపాడు. తనకే ఇలా చేయడం ఏమిటని ఆయన వాపోయాడు. జగన్ పాలనలో పేదలకు జరుగుతున్న న్యాయం ఇదేనా అని ప్రశ్నించాడు.
Updated Date - 2022-06-13T23:05:39+05:30 IST