ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొందరికేనా నిబంధనలు?

ABN, First Publish Date - 2022-12-03T23:48:02+05:30

వర్సిటీ పరిధిలోని పాలనా అంశాల పట్ల సమాన వైఖరి అవలంభించాల్సిన ఎస్కేయూ యాజమాన్యం కొందరి పట్ల వివక్ష చూపుతోందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎస్కేయూ పరిధిలో 9 ప్రైవేట్‌ కళాశాలల్లో ప్రవేశాలు రద్దు

పారదర్శకతకు పాతరేసిన యాజమాన్యం

అనంతపురం సెంట్రల్‌, డిసెంబరు 3: వర్సిటీ పరిధిలోని పాలనా అంశాల పట్ల సమాన వైఖరి అవలంభించాల్సిన ఎస్కేయూ యాజమాన్యం కొందరి పట్ల వివక్ష చూపుతోందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వాతావరణ, శబ్ద కాలుష్యం తదితర వాటిని సాకుగా చూపి తొమ్మిది ప్రైవేట్‌ కళాశాలలకు 2022-23 విద్యా సంవత్సరం ప్రవేశాలను రద్దు చేసింది. రద్దుచేసిన కళాశాలల్లో కనిపిస్తున్న లోపాలు చాలా కళాశాలల్లో ఉన్నా వాటిపై ఎందుకు చర్యలు తీసుకోలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల పలుకుబడికి ఎస్కేయూ యాజమాన్యం తలొగ్గిందని ఆయా కళాశాలల యాజమాన్యాలు మండిపడుతున్నాయి. ఎస్కేయూ అనుబంధంగా ఉమ్మడి జిల్లాలో 75 ప్రైవేట్‌ కళాశాలలు ఉన్నాయి. అనంతపురం నగరంలోని కళాశాలల విద్యార్థులువాతావరణ, శబ్ద కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వాణిజ్య సముదాయాల్లోని భవనాల్లో కళాశాలలను నిర్వహిస్తుండటంతో అనేక సమస్యలకు గురవుతున్నారు. నిబంధనలకు లోబడి నడపుతున్న కళాశాల ఎక్కడా కనిపించదు. అయితే నిబంధనల పేరుతో ఎస్కేయూ యాజమాన్యం కొన్ని కళాశాలలపై కొరడా ఝళిపించడంతో ఈ విద్యాసంవత్సరం ప్రవేశాలను కోల్పోయాయి.

నగరంలో ఎలా ఉన్నా..

వర్సిటీ అనుబంధ కళాశాలల గుర్తింపు నిబంధనల మేరకు సొంత భవనాలు ఉండాలి. ల్యాబ్‌లు, తరగతి గదులు, ఐదు ఎకరాల క్రీడా స్థలం వంటి అనేక వసతులు, సౌకర్యాలు ఉండాలి. నగరంలో చాలా ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలను ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేశారు. వాణిజ్య సముదాయ భవనాల్లో కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. నిబంధనలు పాటించని కళాశాలలకు గుర్తింపు ఇవ్వబోమని చెబుతున్న వర్సిటీ యాజమాన్యం, వీటికి ఎలా అనుమతులు ఇచ్చిందన్న విమర్శలు వస్తున్నాయి. కొన్నింటిపట్ల వివక్ష చూపించినట్లు స్పష్టంగా అర్థమౌతోంది. కొన్ని కశాశాలలపై వేటువేసి, మరికొన్నింటిని వదిలేశారని వర్సిటీ వర్గాలు విమర్శిస్తున్నాయి.

Updated Date - 2022-12-03T23:48:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising