ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆక్వా కల్చర్‌ మరింత అభివృద్ధి చెందాలి: కలెక్టర్‌

ABN, First Publish Date - 2022-12-06T23:38:11+05:30

జిల్లాలో ఆక్వా కల్చర్‌ మరింత అభివృద్ధి చెందాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆక్వాకల్చర్‌పై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆక్వా కల్చర్‌ మరింత అభివృద్ధి చెందాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆక్వాకల్చర్‌పై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో అనుమతి లేకుండా 1,401 ఎకరాల్లో రొయ్యలు సాగుచేస్తున్న 464 మంది రైతులను గుర్తించినట్లు చెప్పారు. కోస్టల్‌ ఆక్వాక ల్చర్‌ అథారిటీ(చెన్నై)లో రిజిస్టర్‌ చేయనవి తొలగిస్తామన్నారు. అథారిటీలో క్రమబద్ధీకరణ చేసుసుకునేందుకు చర్యలు తీసుకోవాలని డివిజనల్‌ స్థాయి ఆక్వాకల్చర్‌ కమిటీలను ఆదేశించారు. 1,552 ఎకరాల్లో మాత్రం రిజిస్ట్రేషన్‌ అయ్యాయని వెల్లడించారు. మత్స్యశాఖ జేడీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్‌ ఉన్నవాటికే రాయితీలు వర్తిస్తాయని చెప్పారు. ఐదు హెక్టార్ల కంటే తక్కువ విస్తీర్ణం గల రైతుల దరఖాస్తులను డివిజనల్‌ స్థాయి కమిటీ చైర్మన్‌ ఆమోదంతో కోస్టల్‌ ఆక్వాకల్చర్‌కు రిజిస్ట్రేషన్‌ కోసం పంపవచ్చని చెప్పారు. ఈ సమావేశంలో టెక్కలి సబ్‌కలెక్టర్‌ రాహుల్‌రెడ్డి, డీఎఫ్‌వో హారిక, మత్స్యశాఖ జేడీ శ్రీనివాసరావు, జడ్పీ సీఈవో వెంకటరామన్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-06T23:38:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising