ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించాలి

ABN, First Publish Date - 2022-11-29T23:33:30+05:30

విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించేలా విద్యార్థులను తల్లిదండ్రులు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మంత్రి కాకాణి గోవర్దనరెడ్డి అభిప్రాయపడ్డారు.

క్రికెట్‌ ఆడుతున్న కాకాణి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు (విద్య), నవంబరు 29 : విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించేలా విద్యార్థులను తల్లిదండ్రులు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మంత్రి కాకాణి గోవర్దనరెడ్డి అభిప్రాయపడ్డారు. యువత ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ మంచి నడవడకితో ఉత్తమంగా ఎదగాలని సూచించారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో మంగళవారం జిల్లాస్థాయి క్రీడా సంబరాలను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. తల్లిదండ్రులు కేవలం ర్యాంకుల కోసం పిల్లలను కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో చేర్పిస్తూ వారిని యాంత్రికంగా తయారు చేయడం బాధాకరమన్నారు. ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ క్రీడల్లో పాల్గొనడం విద్యార్థులకు దినచర్య కావాలన్నారు. యువతను క్రీడల్లో ప్రోత్సహిం చాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ పోటీలు నిర్వహిస్తోందని చెప్పారు. జాయింట్‌ కలెక్టర్‌ కూర్మనాఽథ్‌ మాట్లాడుతూ యువత ఏ రంగంలో రాణించాలన్నా క్రీడా రంగంలో ప్రావీణ్యత ఉంటే సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు నియోజకవర్గాల నుంచి హాజరైన క్రీడాకారుల నుంచి మంత్రి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన ముక్కాల ద్వారకానాథ్‌, డీఆర్‌డీఏ పీడీ సాంబశివారెడ్డి, ఆర్‌ఐవో వరప్రసాద్‌రావు, ఇనచార్జి డీఈవో సుబ్బారావు, డీఎంహెచవో పెంచలయ్య, సెట్నల్‌ సీఈవో పుల్లయ్య, డీఎస్‌ఏ చీఫ్‌ కోచ ఆర్‌కే యతిరాజ్‌, యువజన శాఖ అధికారి మహేందర్‌రెడ్డి, శాప్‌ డైరెక్టర్‌ కాలువ నర్సింహులు, జిల్లా ఓలంపిక్‌ సంఘం కార్యదర్శి విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-29T23:34:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising