Bonda umamaheshwar rao: టీడీపీ నేత బోండా ఉమా హౌస్ అరెస్ట్
ABN, First Publish Date - 2022-07-26T16:38:14+05:30
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమానును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
అమరావతి: టీడీపీ(TDP) పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమా(Bonda uma)ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దళిత గర్జనకు వెళ్లనీయకుండా బోండా ఉమాను గృహనిర్బంధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దళిత గర్జన జరిగితే జగన్ రెడ్డి(Jagan reddy) దళితులకు చేస్తున్న మోసాలు బయట పడతాయనే సీఎం భయమని అన్నారు. దళిత సోదరులు జగన్ రెడ్డి మోసాలు గ్రహించాలని తెలిపారు. కోర్టులు ముందస్తు నిర్బంధాలు చేయద్దు అన్నా ప్రభుత్వ వత్తిడితో పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని మండిపడ్డారు. దళితులకు జగన్ రెడ్డి ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు(Chandrababu) హయాంలో దళితులకు స్వర్ణ యుగం అని బోండా ఉమా పేర్కొన్నారు.
Updated Date - 2022-07-26T16:38:14+05:30 IST