Varla Ramaiah: జగన్ పాలనలో దళితులు పరిస్థితి దయనీయం
ABN, First Publish Date - 2022-11-11T17:14:00+05:30
Vijayawada: జగన్ పాలనలో దళితుల పరిస్థితి దయనీయంగా తయారైందని టీడీపీ (TDP) ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు యం. యస్.రాజు ఆరోపించారు.
Vijayawada: జగన్ పాలనలో దళితుల పరిస్థితి దయనీయంగా తయారైందని టీడీపీ (TDP) ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు యం. యస్.రాజు ఆరోపించారు. శుక్రవారం విజయవాడలో టీడీపీ ఆధ్వర్యంలో ఎస్సీ సెల్ సమావేశం జరిగింది. ఇందులో టీడీపీ నేతలు నక్కా ఆనంద్ బాబు (Nakka Anand Babu), వర్ల రామయ్య (Varla Ramaiah) పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మునుపెన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని, తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత సంక్షేమ పథకాలను జగన్ నిర్వీర్యం చేస్తున్నాడని విమర్శించారు. దళితులపై జగన్(CM Jagan) ధమనకాండను దళిత వాడల్లోకి తీసుకువెళ్తామన్నారు. దళితుల ఓట్లతో గద్దె నెక్కిన జగన్.. నేడు దళితులపై విషం చిమ్ముతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు వర్తించే 29 సంక్షేమ పథకాలను రద్దు చేసిన జగన్ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో దళితులంతా కలిసి రాజకీయ సమాధి కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
Updated Date - 2022-11-11T17:14:01+05:30 IST