Justice Ravindra Babu : త్రిపురాంతకేశ్వరుని సేవలో జస్టిస్ రవీంద్రబాబు
ABN, First Publish Date - 2022-11-05T05:42:25+05:30
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం త్రిపురాంతకంలో త్రిపురాంతకేశ్వర స్వామి, బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవార్ల ఆలయాల్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ.రవీంద్రబాబు దంపతులు శుక్రవారం పూజలు నిర్వహించారు.
త్రిపురాంతకం, నవంబరు 4: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం త్రిపురాంతకంలో త్రిపురాంతకేశ్వర స్వామి, బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవార్ల ఆలయాల్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ.రవీంద్రబాబు దంపతులు శుక్రవారం పూజలు నిర్వహించారు. వారికి ఆలయ అధికారులు, పాలక మం డలి సభ్యులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం న్యాయమూర్తి దంపతులు స్వామివారికి మహాన్యాస పూర్వక అభిషేకం, చిన్నమస్తాదేవికి పూజలు, బాలాత్రిపుర సుందరి అమ్మవారికి అర్చనలు నిర్వహించారు.
చెన్నకేశవస్వామిని దర్శించుకున్న న్యాయమూర్తి
మాచర్ల రూరల్, నవంబరు 4: పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రబాబు శుక్రవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ కమిటి సభ్యులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శనానంతరం న్యాయమూర్తికి జ్ఞాపికను అందజేశారు.
Updated Date - 2022-11-05T05:42:26+05:30 IST