ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Visakha Steel Plant: విశాఖ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తే ప్రజలకు నష్టం: ఉండవల్లి

ABN, First Publish Date - 2022-11-20T17:04:57+05:30

విశాఖ ప్లాంట్‌ (Visakha Steel Plant)ను ప్రైవేటీకరిస్తే ప్రజలకు నష్టమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ (Vundavalli Aruna Kumar) తెలిపారు. అల్లూరి విజ్ఞాన కేంద్రంలో రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో సదస్సు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో మహాసదస్సు నిర్వహించారు.

Undavalli Aruna Kumar
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: విశాఖ ప్లాంట్‌ (Visakha Steel Plant)ను ప్రైవేటీకరిస్తే ప్రజలకు నష్టమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ (undavalli Aruna Kumar) తెలిపారు. అల్లూరి విజ్ఞాన కేంద్రంలో రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో సదస్సు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో మహాసదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉండవల్లి మాట్లాడుతూ విశాఖ ఉక్కు పోరాటం మరింతగా కొనసాగించాలని కోరారు. ప్రభుత్వాలు లాభాపేక్షతో వ్యవహరించవద్దని ఉండవల్లి అరుణ్‌కుమార్‌ సూచించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దని జేడీ లక్ష్మీనారాయణ (Lakshminarayana)కోరారు. ఎన్ఎండీసీ, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విశాఖ ప్లాంట్‌ను కలపాలన్నారు. స్టీల్‌ప్లాంట్‌పై పిల్ వేస్తే రాజకీయాలకు ముడిపెట్టడం దారుణమని పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాపార ధోరణితో మాట్లాడుతున్నాయని లక్ష్మీనారాయణ విమర్శించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుపై ప్రజాఉద్యమం సాగాలని నటుడు ఆర్.నారాయణమూర్తి (Narayanamurthy) కోరారు. అన్ని పార్టీలు ఎజెండా పక్కనపెట్టి విశాఖ ఉక్కు కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఆంధ్రులంటే ఆరంభశూరులు కాదు.. ప్రారంభవీరులని కేంద్రం గుర్తుపెట్టుకోవాలని ఆర్.నారాయణమూర్తి అన్నారు.

Updated Date - 2022-11-20T17:07:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising