ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒక్క ఛాన్స్‌తో రాష్ట్రం సర్వనాశనం

ABN, First Publish Date - 2022-10-29T00:04:01+05:30

ఒక్క ఛాన్స్‌ అంటూ జగన్‌ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశం చేస్తున్నారని అరకు పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధి గంగపూజారి శివకుమార్‌ అన్నారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న శివకుమార్‌, పక్కన గిడ్డి ఈశ్వరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగన్‌కు బుద్ది చెప్పే రోజులు దగ్గరపడ్డాయి

టీడీపీ నాయకుల హౌస్‌ అరెస్టులు అన్యాయం

అరకు పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ ప్రతినిధి శివకుమార్‌

పాడేరు రూరల్‌, అక్టోబరు 28: ఒక్క ఛాన్స్‌ అంటూ జగన్‌ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశం చేస్తున్నారని అరకు పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధి గంగపూజారి శివకుమార్‌ అన్నారు. పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి నివాసగృహం కుమ్మరిపుట్టులో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రుషికొండ భూములపై టీడీపీ నిర్వహించే నిరసన కార్యక్రమానికి బయలుదేరిన నాయకులను కుమ్మరిపుట్టు వద్ద పోలీసులు అడ్డుకొని అరెసు చేయడం అన్యాయమన్నారు. అనారోగ్యం కారణంగా వైద్యుల సలహా మేరకు ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్న గిడ్డి ఈశ్వరిని సైతం పోలీసులు హౌస్‌ అరెస్టు చేయడం చూస్తుంటే వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఎంత నిరంకుశపాలన కొనసాగిస్తున్నదో అర్థమవుతున్నదన్నారు. విశాఖలో కొండలను మింగిన వైసీపీ అనకొండల బండారం బయటపడుతుందన్న భయంతోనే టీడీపీ నాయకులను హౌస్‌ అరెస్టులు చేయించారని ఆరోపించారు. వైసీపీ దోపిడి బయటపడుతుందనే తాడేపల్లి పిల్లి భయపడిందా? అని ఆయన ఎద్దేవా చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలకు పాల్పడినా టీడీపీ చేపట్టిన సేవ్‌ ఉత్తరాంధ్ర కార్యక్రమం ఆగదన్న విషయాన్ని జగన్‌రెడ్డి గుర్తించాలన్నారు. వైసీపీ పాలన చూసి రాష్ట్ర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని, జగన్‌కు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు పోలుపర్తి గోవిందరావు, తెలుగుయువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోడా వెంకట సురేష్‌కుమార్‌, రాష్ట్ర ఎస్టీసెల్‌ కార్యదర్శి గబ్బాడ సింహాచలం, నాయకులు డప్పోడి వెంకటరమణ(బుజ్జి), ఆర్‌.కొండబాబు, మత్స్యకొండంనాయుడు, ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-10-29T00:04:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising