ఉమ్మడి విశాఖ జిల్లా ఆర్చరీ పోటీలు
ABN, First Publish Date - 2022-12-02T00:31:21+05:30
ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఆర్చరీ (విలువిద్య) అండర్-14, అండర్-17 పోటీలను గురువారం ఇక్కడ క్రీడా పాఠశాల మైదానంలో ప్రిన్సిపాల్ పీఎస్‌ఎన్.మూర్తి ప్రారంభించారు.
విజేతలకు పతకాలు ప్రదానం
అరకులోయ, డిసెంబరు 1: ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఆర్చరీ (విలువిద్య) అండర్-14, అండర్-17 పోటీలను గురువారం ఇక్కడ క్రీడా పాఠశాల మైదానంలో ప్రిన్సిపాల్ పీఎస్‌ఎన్.మూర్తి ప్రారంభించారు. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల నుంచి సుమారు 100 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. స్కూల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అల్లూరి జిల్లా కార్యదర్శిగా వ్యవహరిస్తున్న అరకులోయ ప్రభుత్వ పాఠశాల పీడీ సూరిబాబు ఆధ్వర్యంలో ఆర్చరీ పోటీలు నిర్వహించారు. అండర్-14 బాలికల విభాగంలో పి.అర్యాన బంగారు పతకం, ఎం.కావ్య రజత, బి.ప్రీతి, వి.దివ్య కాంస్య పతకాలు సాధించారు. బాలుర విభాగంలో ఆర్.రామచైతన్య (స్వర్ణ) జి.నాగదుర్గప్రసాద్ (రజత), ఎస్.జయప్రసాద్, కె.దినేశ్ కార్తీక్, ఆర్.గణేశ్‌నాయక్ (కాంస్య) పతకాలు సాధించారు. అండర్-17 బాలికల విభాగంలో పి.ఝాన్సీబాయి (స్వర్ణ), వి.సువర్ణ (రజత), కె.సావిత్రి, కె.కవితారాణి(కాంస్య) పతకాలు పొందారు. బాలుర విభాగంలో ఆర్‌ఎన్‌బీ నాయక్, కె.భరత్‌రామ్, కె.వినయ్ వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు పొందారు. అరకులోయ జడ్పీటీసీ సభ్యురాలు శెట్టి రోష్నీ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు పతకాలు అందజేశారు. విజేతలంతా త్వరలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని ప్రిన్సిపాల్ మూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రీడా పాఠశాల కోచ్ సూరిబాబు, పీడీలు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-02T00:31:22+05:30 IST