low pressure: బలపడనున్న అల్పపీడనం.. ఏపీకి వర్షసూచన
ABN, First Publish Date - 2022-12-15T19:26:07+05:30
హిందూ మహాసముద్రం (Indian Ocean) దానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం (low pressure) స్థిరంగా కొనసాగుతోంది.
విశాఖపట్నం: హిందూ మహాసముద్రం (Indian Ocean) దానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం (low pressure) స్థిరంగా కొనసాగుతోంది. ఇది పశ్చిమంగా పయనించి గురువారం రాత్రికి తీవ్ర అల్పపీడనంగా మారనున్నది. తరువాత రెండు రోజుల పాటు పశ్చిమంగా పయనిస్తుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అల్పపీడనం ప్రభావంతో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా మారి ఈనెల 20వ తేదీ తరువాత తమిళనాడు, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంటున్నారు. ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. కాగా గురువారం కోస్తా, రాయలసీమల్లో వాతావరణం పొడిగా ఉంది. రానున్న 24 గంటల్లో కూడా పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే మధ్య భారతంలో నెలకొన్న చలి గాలుల తీవ్రతతో శివారు ప్రాంతాలు, ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత పెరిగింది. ఆరోగ్యవరంలో 17.5. డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
Updated Date - 2022-12-15T19:26:08+05:30 IST