Palla Srinivasa Rao: రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి...
ABN, First Publish Date - 2022-09-22T20:14:00+05:30
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంతో శాంతి భద్రతలు క్షీణించాయని టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు అన్నారు.
విశాఖ (Visakha): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని విశాఖ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) విమర్శించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న విశాఖపట్టణం ఇప్పుడు హత్యలకు, భూ ఆక్రమణలకు నిలయంగా మారిందన్నారు. వైసీపీ ప్రభుత్వం (YCP Govt.) అమ్ముతున్న కల్తీ మద్యం తాగి అనేక మంది చనిపోతున్నారన్నారు. విశాఖ.. గంజాయి, డ్రగ్స్‌కు అడ్డాగా మారుతోందని, గంజాయి ఎగుమతులలో వైసీపీ నాయకుల హస్తం ఉందని ఆరోపించారు. పోలీసులు కూడా వైసీపీ నాయకులు చెప్పిందే చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖకు సీఎం జగన్ వచ్చినా... శాంతిభద్రతల కట్టడి అయ్యే పరిస్థితి కనబడడం లేదని పల్లా శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
Updated Date - 2022-09-22T20:14:00+05:30 IST