నేడు ఉదయం 8 నుంచే జూ పార్క్‌లోకి అనుమతి
ABN, First Publish Date - 2022-10-29T00:42:49+05:30
నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం 8 గంటల నుంచే జూపార్క్‌లోకి సందర్శకులను అనుమతించనున్నట్లు జూ క్యూరేటర్ డాక్టర్ నందనీ సలారియా తెలిపారు.

- నాగుల చవితి సందర్భంగా వెసులుబాటు
విశాఖపట్నం, అక్టోబరు 28: నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం 8 గంటల నుంచే జూపార్క్‌లోకి సందర్శకులను అనుమతించనున్నట్లు జూ క్యూరేటర్ డాక్టర్ నందనీ సలారియా తెలిపారు. సాయంత్రం ఐదు గంటల వరకు సందర్శకులను అనుమతిస్తామన్నారు. జూలోకి బాణసంచా, పేలుడు పదార్థాలు, క్రాకర్లు తీసుకురాకూడదని, అలా వచ్చిన వారిని అనుమతించమన్నారు. ఎవరైనా జూ సిబ్బంది కళ్లుగప్పి నిషేధిత వస్తువులు తీసుకువచ్చి వినియోగిస్తే భారీగా జరిమానా విధించనున్నట్లు హెచ్చరించారు.
ముడసర్లోవ పార్కులోకి ఉచిత ప్రవేశం
ఆరిలోవ : నాగుల చవితి సందర్భంగా శనివారం 13వ వార్డులోని ముడసర్లోవ పార్కులోకి ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పర్వదినం కావున ఉచిత ప్రవేశానికి అవకాశం కల్పించాలని వార్డు కార్పొరేటర్ కెల్ల సునీత పార్కు కాంట్రాక్టర్‌తో మాట్లాడి ఒప్పించడంతో ఆయన అందుకు అంగీకరించినట్లు తెలిపారు.
Updated Date - 2022-10-29T00:42:54+05:30 IST