ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rain: కోస్తా, రాయలసీమకు వర్షసూచన.. రైతుల్లో ఆందోళన

ABN, First Publish Date - 2022-11-21T20:54:46+05:30

వాయుగుండం సోమవారం మధ్యాహ్నానికి చెన్నైకు 350 కి.మీ. తూర్పు ఆగ్నేయంగా, మచిలీపట్నానికి 470 కి.మీ. దక్షిణ ఆగ్నేయంగా నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: వాయుగుండం సోమవారం మధ్యాహ్నానికి చెన్నైకు 350 కి.మీ. తూర్పు ఆగ్నేయంగా, మచిలీపట్నానికి 470 కి.మీ. దక్షిణ ఆగ్నేయంగా నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయువ్యంగా దిశ మార్చుకుని సోమవారం అర్ధరాత్రి తరువాత తీవ్ర అల్పపీడనంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తరువాత పశ్చిమ వాయువ్యంగా పయనిస్తూ మంగళవారం ఉదయం ఉత్తర తమిళనాడు (North Tamil Nadu), దక్షిణ కోస్తా తీరాలకు సమీపంగా రానున్నదని పేర్కొంది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి.

రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తాలో ఎక్కువచోట్ల, రాయలసీమ (Rayalaseema)లో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాలో తీరం వెంబడి గంటకు 45 నుంచి 55, అప్పుడప్పుడు 65 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. విశాఖపట్నం (Visakhapatnam), గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవుల్లో ఒకటో నంబరు భద్రతా సూచిక ఎగురవేయగా కళింగపట్నం, భీమునిపట్నం రేవులను అప్రమత్తం చేశారు.

కాగా బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో వర్షాలు కురిసే వాతావరణం నెలకొనడంతో కోస్తాలో వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కోతలు సాగుతుండడంతో కొద్దిపాటి వర్షం కురిసినా చేతికొచ్చిన పంట పోతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వాయుగుండం సోమవారం రాత్రికి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడినా...మరో రెండు రోజులు దాని ప్రభావం వుంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కొన్నిచోట్ల వరి కోతలు రెండు, మూడు రోజులు వాయిదా వేస్తున్నారు. ఇప్పటికే కోసిన రైతులు పనలు పూర్తిగా ఆరకపోయినా వర్షం పడితే తడిసిపోతుందన్న ఆందోళనతో కుప్పలు వేస్తున్నారు.

Updated Date - 2022-11-21T20:54:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising