ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాజంగి జలాశయం గేట్లుకు మరమ్మతులు

ABN, First Publish Date - 2022-05-01T06:20:02+05:30

మండలంలోని తాజంగి జలాశయం కుడి, ఎడమ కాలువల గేట్లు, గండ్లు రూ.19.05లక్షలతో మరమ్మతులు చేసినట్టు ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ అన్నారు.

గేట్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, పీవో గోపాలక్రిష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గోపాలక్రిష్ణ

చింతపల్లి, ఏప్రిల్‌ 30: మండలంలోని తాజంగి జలాశయం కుడి, ఎడమ కాలువల గేట్లు, గండ్లు రూ.19.05లక్షలతో మరమ్మతులు చేసినట్టు ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ అన్నారు. శనివారం జలాశయం కుడి, ఎడమ గేట్లను ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ.. గేట్లు మరమ్మతులకు గురయ్యాయని ప్రజాప్రతినిధులు, ఎస్‌ఎంఐ అధికారులు తమ దృష్టికి తీసుకు రావడంతో వాటి మరమ్మతులకు నిధులు మంజూరు చేశానన్నారు.  జలాశయం గేట్‌ వాల్స్‌ వద్ద ప్లాట్‌ఫామ్స్‌ కూడా నిర్మించామన్నారు. ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. గేట్లు, గండ్లు మరమ్మతులతో ఖరీఫ్‌, రబీ సీజన్లలో జలాశయానికి దిగువనున్న 540 ఎకరాలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎంఐ ఈఈ సీతారామ్‌ నాయుడు, డీఈఈ నాగేశ్వరరావు, ఎంపీడీవో సీతయ్య, ఏఎంసీ చైర్‌పర్సన్‌ జల్లి హలియారాణి, స్థానిక సర్పంచ్‌ మహేశ్వరి, ఎంపీటీసీ సభ్యురాలు కోరాబు అనుషదేవి పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-01T06:20:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising