తెరముందుకు రాబిన్‌శర్మ
ABN, First Publish Date - 2022-11-20T02:52:53+05:30
టీడీపీ ఎన్నికల వ్యూ హకర్తగా పనిచేస్తున్న రాబిన్‌శర్మ శనివారం తొలిసారి అధికారికం గా తెర ముందుకువచ్చారు.
టీడీపీ ఎన్నికల వ్యూహకర్తగా సేవలు
మొదటిసారి పార్టీ వేదికపై ప్రసంగం
అమరావతి, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): టీడీపీ ఎన్నికల వ్యూ హకర్తగా పనిచేస్తున్న రాబిన్‌శర్మ శనివారం తొలిసారి అధికారికం గా తెర ముందుకువచ్చారు. సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఇదేం ఖర్మ కార్యక్రమం గురించి ఆంగ్లంలో వివరించారు. స్వేచ్ఛ అనే మహిళ తెలుగులో వివరించారు. టీడీపీ తన రాజకీయ చరిత్ర లో ఎన్నికల వ్యూహకర్తను నియమించుకోవడం ఇదే ప్రథమం. సా మాజిక మాధ్యమాల ప్రభావం పెరిగిన నేపథ్యంలో ఎన్నికల వ్యూ హకర్త అవసరం ఉందని గుర్తించిన టీడీపీ నాయకత్వం కొంతకా లం క్రితం రాబిన్‌ను నియమించుకుంది. గుజరాత్‌కు చెందిన రాబి న్ గతంలో ప్రశాంత్ కిశోర్ బృందంలో పనిచేశారు. పీకే బృందం నుంచి బయటకు వచ్చిన తర్వాత సొంతంగా ఒక సంస్థను ఏర్పా టు చేసుకొని వివిధ పార్టీలకు పనిచేస్తున్నారు. రాబిన్‌ను తీసుకు న్న తర్వాత కొంతకాలం కిందట టీడీపీ నాయకత్వం సునీల్ కనుగోలు అనే మరో వ్యూహకర్తను కూడా నియమించుకుంది. అయితే సునీల్‌కు ఏపీ పై వ్యక్తిగతంగా దృష్టి కేంద్రీకరించే సమయం లేకపోవడంతో టీడీపీ ఆయనను వద్దనుకొంది. ‘‘ప్రజలంతా ఆనందంగా ఉన్నారన్న తప్పుడు భావనను వ్యాపింపచేయడానికి అధికా ర పార్టీ ఒక ప్రచార వ్యూహాన్ని అమలు చేస్తోంది. ప్రజలు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు? వారి జీవనం ఎంత దుర్భరంగా మారిందన్నది ప్రధాన ప్రతిపక్షంగా మనం చూపించాలి. ఈ విషయాలన్నీ ప్రజల్లోకి వెళ్లి చెప్పాలి. వారి మనోగతం తెలుసుకోవాలి’’ అని రాబిన్ శర్మ పార్టీ నేతలకు సూచించారు.
Updated Date - 2022-11-20T02:52:55+05:30 IST