ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంట పండింది

ABN, First Publish Date - 2022-11-24T00:54:37+05:30

ఈ ఏడాది జిల్లాలో ఖరీఫ్‌ వరి సాగు ఆశాజనకంగా ఉందని గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరిపంట చేతికి రావడంతో రైతులు కోతలు కోయడం, కుప్పలు వేయడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు.

రామచంద్రపురం వద్ద వరి కోతల్లో నిమగ్నమైన గిరిజన రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లాలో 59,189 హెక్టార్లలో వరి నాట్లు

సకాలంలో వర్షాలు కురవడంతో ఆశాజనకంగా సాగు

పంట కోత, కుప్పల పనుల్లో రైతులు నిమగ్నం

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

ఈ ఏడాది జిల్లాలో ఖరీఫ్‌ వరి సాగు ఆశాజనకంగా ఉందని గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరిపంట చేతికి రావడంతో రైతులు కోతలు కోయడం, కుప్పలు వేయడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు అనుకూలంగా వర్షాలు కురవడంతో పాటు అక్టోబరు, నవంబరు నెలల్లో ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకపోవడంతో వరి రైతులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్‌లో 59,189 హెక్టార్లలో వరిపంటను గిరిరైతులు సాగు చేశారు.

ఈ ఏడాది ఆశాజనకంగా వర్షాలు

ప్రధానంగా ఖరీఫ్‌లో సాగు చేసే వరి పంటకు జూన్‌, జూలై, ఆగస్టు నెలల్లో కురిసే వర్షాల ఆధారంగానే పంట బాగుంటుంది. జిల్లాలో జూన్‌ నెలలో సాధారణ వర్షపాతం 145 మిల్లీమీటర్లు కాగా 162 మిల్లీ మీటర్లు నమోదైంది. జూలైలో 312 మిల్లీ మీటర్లకు 295, ఆగస్టు నెలలో 243కు 233 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఖరీఫ్‌ సీజన్‌కు అవసరమైన మూడు నెలల్లో వర్షం పాతం లోటు కేవలం పది మిల్లీ మీటర్లు మాత్రమే కావడంతో సాగు నీటిపరంగా ఎటువంటి సమస్య ఏర్పడలేదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. వర్షపాతం 30 నుంచి 40 శాతం లోటు నమోదైతే మాత్రం పంటల సాగుకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయని రైతులు అంటున్నారు.

పనుల్లో రైతులు నిమగ్నం

ఏజెన్సీలో ఖరీఫ్‌ సీజన్‌లో పండే వరి పంటే గిరిజన రైతులకు ప్రధాన ఆహారం. ఇతర ప్రాంతాల్లో వరిని వాణిజ్య పంటగా సాగు చేస్తూ మార్కెట్లలో విక్రయిస్తుంటారు. కానీ ఏజెన్సీలో కేవలం తమ ఆహార అవసరాల కోసమే గిరిజన రైతులు వరి పంటను పండిస్తారు. వచ్చిన పంటనంతా నిల్వ చేసుకుని ఏడాదంతా వినియోగిస్తారు. పొరపాటున ప్రకృతి వైపరీత్యాల కారణంగా వరి పంట నాశనమైతే తమ నోటికి అందే తిండి పోయిందని తీవ్రంగా ఆవేదన చెందుతారు. అందువల్ల ఖరీఫ్‌ వరిపై గిరిజనులు పూర్తి స్థాయిలో ఆధారపడి, ఇంటిల్లపాది వ్యవసాయం చేస్తారు. అయితే అన్నీ అనుకూలించి ప్రస్తుతం వరి పంట బాగా పండడంతో గిరిజన రైతులు జోరుగా కోతలు కోస్తూ, వరి పనలను కుప్పలుగా వేసుకుని నిల్వ చేసుకునే పనిలో ఉన్నారు. దీంతో ప్రస్తుతం ఏజెన్సీలో ఎక్కడ చూసినా గిరిజన రైతులు ఆనందంతో ఉత్సాహంగా ఆయా పనులు చేస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి.

అన్నీ అనుకూలించాయి

-ఎస్‌బీఎస్‌ నంద్‌, జిల్లా వ్యవసాయాధికారి, పాడేరు

ఈ ఏడాది ఖరీఫ్‌ వరి పంటకు అన్నీ అనుకూలించడంతో పంట ఆశాజనకంగా పండింది. ముఖ్యంగా సకాలంలో వర్షాలు కురవడంతో పంటకు సాగునీటి సమస్య తలెత్తలేదు. అలాగే వ్యవసాయ శాఖ నుంచి 90 శాతం రాయితీపై అధిక దిగుబడులిచ్చే రకాల 15,850 క్వింటాళ్ల వరి విత్తనాలను గిరిజన రైతులకు పంపిణీ చేశాం. దీంతో వరి దిగుబడులు సైతం ఆశాజనకంగా ఉన్నాయి. ఏ విధంగా చూసినా పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండడంతో వరి రైతులకు ఎంతో మేలు జరిగింది.

Updated Date - 2022-11-24T00:54:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising