low pressure: బలహీనపడిన అల్పపీడనం.. అయినా వర్షాలు
ABN, First Publish Date - 2022-11-24T20:39:19+05:30
దక్షిణ కోస్తా పరిసరాల్లో ఉన్న అల్పపీడనం (low pressure) పూర్తిగా బలహీనపడింది. అయితే అల్పపీడనంపై ఆవరించిన ఉపరితల ఆవర్తనం ఉత్తర తమిళనాడు (North Tamil Nadu) పరిసరాల్లో కొనసాగుతోంది.
విశాఖపట్నం: దక్షిణ కోస్తా పరిసరాల్లో ఉన్న అల్పపీడనం (low pressure) పూర్తిగా బలహీనపడింది. అయితే అల్పపీడనంపై ఆవరించిన ఉపరితల ఆవర్తనం ఉత్తర తమిళనాడు (North Tamil Nadu) పరిసరాల్లో కొనసాగుతోంది. దాంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో పలుచోట్ల గురువారం వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం మేఘాలు ఆవరించడంతో అన్నిచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. ఆరోగ్యవరంలో 21 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా ఉత్తర అండమాన్ సముద్రంలో శుక్రవారం ఉపరితల ఆవర్తనం ఆవరించనున్నది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో అల్పపీడనం ఏర్పడతుందని వాతావరణ నిపుణులు తెలిపారు.
Updated Date - 2022-11-24T20:39:21+05:30 IST