చికిత్స పొందుతూ యువకుడి మృతి
ABN, First Publish Date - 2022-12-19T23:44:10+05:30
రాముడువలస గ్రామానికి చెందిన యలమంచిలి పోలిరాజు(35) గడ్డి నివారణ మందు తాగి, విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు.
బొబ్బిలి: రాముడువలస గ్రామానికి చెందిన యలమంచిలి పోలిరాజు(35) గడ్డి నివారణ మందు తాగి, విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. ఏఎస్‌ఐ జి.భాస్కరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వంగర మండలం శివం గ్రామానికి చెందిన పోలిరాజు 19 ఏళ్ల కిందట బొబ్బిలి మండలం రాముడువలస గ్రామానికి చెందిన లక్ష్మిని వివాహమాడాడు. అదే గ్రామంలో స్థిరప డి కూలీనాలీ చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసైన పోలిరాజును భార్య తరచూ మందలించేది. ఈక్రమంలో మనస్తాపం చెందిన ఆయన ఆదివారం సాయంత్రం ఆమె పొలానికి వెళ్లిన సమయంలో ఇంట్లో గడ్డి నివారణ మందు తాగాడు. ఇది గమనించిన అతని పెద్దకుమారుడు మణికంఠ పొలంలోఉన్న తన తల్లికి విషయం చెప్పాడు. వెంటనే ఆమె పరుగున వచ్చి ఇరుగుపొరుగు సహా యంతో బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడ నుంచి విజయనగరం తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందినట్టు ఏఎస్‌ఐ తెలిపారు. మృతు డికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు మణికంఠ, లవకుమార్ ఉన్నారు. ఈ ఘట నపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్‌ఐ తెలిపారు.
Updated Date - 2022-12-19T23:44:14+05:30 IST