డీఈవో లింగేశ్వరరెడ్డి బాధ్యతల స్వీకరణ
ABN, First Publish Date - 2022-11-18T00:08:37+05:30
జిల్లా విద్యాశాఖ అధికారిగా బి.లింగేశ్వరరెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన అనకాపల్లి డీఈవోగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చిన సంగతి తెలిసిందే.
కలెక్టరేట్, నవంబరు 17: జిల్లా విద్యాశాఖ అధికారిగా బి.లింగేశ్వరరెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన అనకాపల్లి డీఈవోగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇన్‌చార్జి డీఈవో వెంకటేశ్వరరావు నుంచి బాధ్యతలు స్వీకరించారు. ముందుగా కలెక్టర్ సూర్యకుమారి, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావును మర్యాద పూర్వకంగా కలిశారు. బాధ్యతలు స్వీకరించిన డీఈవో లింగేశ్వరరెడ్డికి కార్యాలయం సిబ్బంది, మండల విద్యాశాఖ అధికారులు, పలువురు ఉపాధ్యాయలు శుభాకాంక్షలు తెలిపారు.
Updated Date - 2022-11-18T00:08:38+05:30 IST