ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: వివాహేతర సంబంధాలు కొనసాగించేవాళ్లు ఈ వార్త చూస్తే వణికిపోతారు..!

ABN, First Publish Date - 2022-10-28T16:48:03+05:30

భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందన్న విషయాన్ని తెలుసుకున్న ఆ భర్త కక్షతో రగిలిపోయాడు. ఎలాగైనా అతనిని అంతమొందించాలని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజాం: భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందన్న విషయాన్ని తెలుసుకున్న ఆ భర్త కక్షతో రగిలిపోయాడు. ఎలాగైనా అతనిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. హత్యకు పక్కాగా ప్లాన్ చేశాడు. ఇందులో తన భార్యను కూడా భాగస్వామిని చేశాడు. తన వద్దకు రమ్మని భార్యతో ప్రియుడికి ఫోన్ చేయించాడు. అతను వచ్చే దారిలో కరెంటు వైరు పెట్టాడు. అది తగిలి ప్రియుడు ప్రాణాలు కోల్పోయాడు. రాజాం రూరల్ సీఐ నవీన్‌కుమార్ గురువారం రాజాం స్టేషన్‌లో సంతకవిటి ఎస్‌ఐ జనార్ధనరావుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. సంతకవిటి మండలం ఎంఆర్ అగ్రహారం గ్రామానికి చెందిన లలిత, అదే గ్రామానికి చెందిన గోవిందరావు మధ్య కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది.

ఈ విషయం గోవిందరావు భార్య సావిత్రితో పాటు గ్రామ పెద్దలందరికీ తెలుసు. ఈ వ్యవహారాన్ని సరిదిద్దేందుకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు గ్రామ పెద్దలూ ప్రయత్నించారు. ఈ నేపధ్యంలో గోవిందరావు విశాఖకు మకాం మార్చాడు. అక్కడ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అయినా అతనిలో మార్పు రాలేదు. గ్రామానికి వచ్చిన ప్రతిసారీ గోవిందరావు లలితను కలవడం చూసి లలిత భర్త లక్ష్మణరావు తట్టుకోలేకపోయేవాడు. లోలోపల రగిలిపోతూ అవకాశం కోసం ఎదురుచూశాడు. గ్రామంలో ఓ వేడుకకు గోవిందరావు హాజరైనట్లు తెలుసుకుని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. భార్య లలిత సహకారంతో తన ఇంటికి గోవిందరావు వచ్చే మార్గంలో జీఏ వైరు అడ్డంగా కట్టి దానికి విద్యుత్ సరఫరా ఇచ్చాడు.

ఇంటికి రమ్మని భార్యతోనే గోవిందరావుకు ఫోన్ చేయించాడు. మంగళవారం రాత్రి గోవిందరావు ప్రియురాలు లలిత ఇంటి సమీపం వరకూ ద్విచక్ర వాహనంపై వచ్చి అక్కడి నుంచి నడుచుకుంటూ విద్యుత్ సరఫరాతో ఏర్పాటు చేసిన వైర్లను తాకాడు. అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని మాయం చేయాలని లక్ష్మణరావు, లలిత ప్రయత్నం చేసినా గ్రామస్తుల కదలికలతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. దీంతో 24 గంటల్లోపే పోలీసులకు చిక్కారు. గోవిందరావు మృతికి కారకులైన భార్యాభర్తలు లక్ష్మణరావు, లలితను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి హత్య చేసేందుకు ఉపయోగించిన వైర్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని సీఐ నవీన్‌కుమార్ స్పష్టం చేశారు. వివాహేతర సంబంధాలు ఎప్పటికైనా ప్రాణాల మీదకు తెస్తాయన్న విషయాన్ని గుర్తెరగాలని ఆయన సూచించారు.

Updated Date - 2022-10-28T16:48:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising