ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి ఫారెస్ట్‌ కన్జర్వేటర్స్‌ పరీక్షలు

ABN, First Publish Date - 2022-11-09T00:44:10+05:30

ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు పరీక్షలు బుధవారం నుంచి 11వ తేదీ వరకూ జరుగుతాయని డీఆర్‌వో గణపతిరావు తెలిపారు. పరీక్షల ఏర్పాట్లపై మంగళవారం తన చాంబర్‌లో సమీక్షించారు.

మాట్లాడుతున్న డీఆర్‌వో గణపతిరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టరేట్‌, నవంబరు 8: ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు పరీక్షలు బుధవారం నుంచి 11వ తేదీ వరకూ జరుగుతాయని డీఆర్‌వో గణపతిరావు తెలిపారు. పరీక్షల ఏర్పాట్లపై మంగళవారం తన చాంబర్‌లో సమీక్షించారు. గాజులరేగలోని సత్య ఇంజినీరింగ్‌ కళాశాల కేంద్రంగా జరుగుతాయని చెప్పారు. ఆన్‌లైన్‌ పరీక్షలకు 340 మంది విద్యార్థులు హాజరు కానున్నారని.. 9,10 తేదీల్లో ఉదయం 9.30 నుంచి 12 వరకూ, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకూ రెండు పూటలా జరుగుతాయని, 11వ తేదీన ఉదయం మాత్రమే ఉంటుందని వివరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు సాగేలా చూడాలని చెప్పారు. పరీక్ష కేంద్రంలో అవసరమైన ఇంటర్నెట్‌ కనెక్షన్‌, సిటింగ్‌ ప్లాన్‌, 144 సెక్షన్‌ అమలును పర్యవేక్షించాలని ఆదేశించారు. అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. సమావేశంలో ఏపీపీఎస్సీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-09T00:45:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising