ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Janasena Chief Pawan Kalyan: విజయనగరం జిల్లాలో జనసేనాని క్రేజ్ ఏరేంజ్‌లో ఉందంటే..

ABN, First Publish Date - 2022-11-13T12:48:04+05:30

ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) విజయనగరం చేరుకున్నారు. విజయనగరం వై-జంక్షన్‌లో (Vizianagaram y junction) పవన్‌కు జన సైనికులు గజమాలతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) విజయనగరం చేరుకున్నారు. విజయనగరం వై-జంక్షన్‌లో (Vizianagaram y junction) పవన్‌కు జన సైనికులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. పవన్ కల్యాణ్ విజయనగరం, గొట్లాం మీదుగా 12 గంటలకు గుంకలాం లేఅవుట్‌కు (Gunkalam Layout) చేరుకుంటారు. లబ్దిదారుల సమస్యలు తెలుసుకున్న తర్వాత పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడతారు. ఆయన పర్యటన మధ్యాహ్నం 3 గంటల వరకూ ఉంటుందని జనసేన నాయకులు తెలిపారు. రాష్ట్రంలోనే మెగా లేఔట్‌ గుంకలాం. రెండేళ్ల క్రితం 397.02 ఎకరాల్లో వేశారు. 12,301 ప్లాట్లుగా విభజించారు. 11,828 మందికి పట్టాలు పంపిణీ చేశారు. 10,625 మందికి ఇళ్ల మంజూరు పత్రాలు ఇచ్చేశారు.

ముఖ్యమంత్రి జగనే స్వయంగా ఈ లేఔట్‌కు శంకుస్థాపన చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ లేఔట్‌ నగరానికి 7 కి.మీ. దూరంలో ఉంది. మౌలిక సదుపాయాలూ కల్పించలేదు. పాలకులూ శ్రద్ధ చూపలేదు. దీంతో ఇప్పటి వరకు ఒక్క ఇల్లూ పూర్తి కాలేదు. శ్లాబు వరకు 42 మాత్రమే వచ్చాయి. చాలావరకు పునాది స్థాయిలోనే నిలిచిపోయాయి. ఎంతో ఆర్భాటంగా వేసిన గుంకలాం లేఔట్‌ దుస్థితి ఇది.

2020 డిసెంబరు 30న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (CM Jagan) స్వయంగా ఇక్కడికి వచ్చారు. లేఔట్‌ను ప్రారంభించారు. కొంతమంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలు అందజేశారు. ఇది రాష్ట్రంలోనే పెద్ద లేఔట్‌ అని ప్రకటించారు. ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలని, నిధులకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పుకొచ్చారు. అయితే వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఇప్పటికీ ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు.

మౌలిక వసతులేవీ?

ఇళ్ల నిర్మాణాలు పూర్తయినవి లేఅవుట్లో ఎక్కడా కన్పించడం లేదు. అయితే శ్లాబు వరకు వచ్చిన ఇళ్లు 40వరకు ఉన్నాయి. కానీ ఈ ఇళ్లల్లో గృహ ప్రవేశాలు చేయాలంటే ఫ్లోరింగ్‌, ప్లంబింగ్‌, విద్యుత్‌ మీటర్ల సర్వీసులు ఇలా పెండింగ్‌ పనులు ఉన్నాయి. కానీ గృహ నిర్మాణశాఖ మాత్రం 42 ఇళ్లను పూర్తి చేశామని గొప్పగా చెపుతోంది. 10,625 మంది లబ్ధిదార్లకు ఇళ్లను మంజూరు చేస్తే ఇప్పటికీ పూర్తి స్థాయిలో నిర్మాణాలు జరగలేదంటే ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

అధ్వానంగా రోడ్లు

ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు ముడిసరకులు అవసరం. రోడ్లు పక్కాగా వేయని కారణంగా సిమెంట్‌, ఐరన్‌, ఇటుకలు, ఇసుక తెచ్చే వాహనాలు మట్టి రోడ్లపై దిగబడిపోతున్నాయి. వీటికి బయటకు తీయాలంటే ఎన్నో వ్యయప్రయాలు ఎదురవుతున్నాయి. దీంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో నిర్మాణాలు చేపట్టేందుకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు.

నీరెక్కడ?

గృహ నిర్మాణాలు జరగాలంటే నీరు అవసరం. ప్రతి రెండు లేదా మూడిళ్లకు ఒక కుండీ కట్టారు. పైపులైన్‌ ద్వారా పంపింగ్‌ చేసి నీటిని అందించే ఏర్పాట్లు చేశారు. సంబంధిత కాంట్రాక్టర్‌కు చెల్లింపులు చేశారు. కానీ పైపులైన్లు సక్రమంగా పనిచేయక పోవటం, కుండీలకు లీకులు, వాటికి అమర్చిన ఆన్‌ ఆఫ్‌ టేప్‌లు చాలాచోట్ల పాడైపోయాయి. దీంతో కుండీలు వృథాగా ఉన్నాయి.

విద్యుత్‌ లైన్లు ఏవీ?

లేఅవుట్లో హెచ్‌టీ లైన్‌ వేశారు. దీన్నుంచి అన్ని వీధులకు ఎల్‌టీ లైన్‌ వేయాల్సి ఉన్నా అరకొర పనులు చేశాఉ. దీంతో విద్యుత్‌ సౌకర్యం లేకుండా పోయింది. అలాగే సొంతంగా సర్వీసు పొందినా విద్యుత్‌ లేని కారణంగా ముందుకు సాగలేని పరిస్థితి ఉంది. లబ్ధిదారులకు మీటర్లు అందించేందుకు విద్యుత్‌శాఖ ముందుకు రావటం లేదు.

అమ్మకానికి ప్లాట్లు

లేఅవుట్లో రోడ్లు, నీరు, విద్యుత్‌ వంటి మౌలిక వసతులు లేని కారణంగా కొంతమంది లబ్ధిదారులు వారి స్థలాలను అమ్మకానికి పెడుతున్నారు. లేఅవుట్‌కు వెళితే స్థలాల అమ్మకం బ్రోకర్లు కనిపిస్తున్నారు. లబ్ధిదారులతో బేరసారాలు నెరుపుతున్నారు.

Updated Date - 2022-11-13T12:48:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising