ఎన్టీఆర్ పేరు కొనసాగించాలి
ABN, First Publish Date - 2022-11-05T00:07:01+05:30
వైద్య విశ్వవిద్యాలయం పేరును మార్పు చేయడం సరికాదని, ఎన్టీఆర్ గానే ఆ పేరును కొనసాగించాలని విజయనగరం నియోజకవర్గం టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు.
కలెక్టరేట్: వైద్య విశ్వవిద్యాలయం పేరును మార్పు చేయడం సరికాదని, ఎన్టీఆర్ గానే ఆ పేరును కొనసాగించాలని విజయనగరం నియోజకవర్గం టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయం పేరు మార్చడానికి వ్యతిరేకంగా సంతకాలు సేక రించారు. ఈ సంతకాలు సేకరించిన ఫ్లెక్సీని శుక్రవారం కలెక్టర్ సూర్యకుమారికి అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఐవీపీ రాజు మాట్లాడుతూ ఘన చరిత్రగల నాయకుడి పేరును వైసీపీ నాయకులు మార్పు చేయడం సరికాదని ఆరో పించారు. వెంటనే ఎన్టీఆర్ పేరును కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షం లోని దీనిపై పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కర్రోతు వెంకట నర్సింగరావు, బొద్దల నర్సింగరావు తదితరులు ఉన్నారు.
Updated Date - 2022-11-05T00:07:04+05:30 IST