వైభవంగా పోలి పాడ్యమి
ABN, First Publish Date - 2022-11-25T00:26:56+05:30
పోలిపాడ్యమిని భక్తులు వైభవంగా నిర్వహించారు. నెల రోజుల పాటు చేసిన కార్తీక మాస ఉపవాస దీక్షలు, పూజలు గురువారంతో ముగిశాయి. చివరి రోజు పోలి పాడ్యమిని పురస్కరించుకుని వేకువజామునే నదీ, సముద్ర తీరాలు, చెరువుల వద్ద భక్తులు పుణ్యస్నానాలు చేసి అరటి దవ్వలపై దీపాలను వెలిగించి వదిలారు.
ముగిసిన కార్తీక మాసం
విజయనగరం(ఆంధ్రజ్యోతి), నవంబరు 24: పోలిపాడ్యమిని భక్తులు వైభవంగా నిర్వహించారు. నెల రోజుల పాటు చేసిన కార్తీక మాస ఉపవాస దీక్షలు, పూజలు గురువారంతో ముగిశాయి. చివరి రోజు పోలి పాడ్యమిని పురస్కరించుకుని వేకువజామునే నదీ, సముద్ర తీరాలు, చెరువుల వద్ద భక్తులు పుణ్యస్నానాలు చేసి అరటి దవ్వలపై దీపాలను వెలిగించి వదిలారు. చంపావతి, వేగావతి, గోముఖి, సువర్ణముఖి, గోస్తనీ నదీతీరాలు ప్రత్యేక శోభతో కనిపించాయి. కార్తీక దీపాలతో కనువిందుగా మారాయి. అనంతరం ఆలయాలకు వెళ్లి శివుడికి పూజలు నిర్వహించారు. విజయనగరంలోని పైడిమాంబ ఆలయం, కన్యకాపరమేశ్వర ఆలయం, పశుపనాథేశ్వర స్వామి ఆలయం, శివ పంచాయతన ఆలయం భక్తులతో కిటకిటలాడాయి.
Updated Date - 2022-11-25T00:26:58+05:30 IST