ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

9న జిల్లాకు సీఎం ?

ABN, First Publish Date - 2022-08-02T05:15:41+05:30

సీతంపేట వేదికగా ఈ నెల 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని రాష్ట్రస్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎన్టీఆర్‌ గ్రీన్‌ఫీల్డ్‌ మైదానాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదివాసీ దినోత్సవానికి హాజరయ్యే అవకాశం

సీతంపేటలో ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న కలెక్టర్‌

పార్వతీపురం - ఆంధ్రజ్యోతి/ సీతంపేట: సీతంపేట వేదికగా ఈ నెల 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని రాష్ట్రస్థాయిలో  ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  ముఖ్యమంత్రి జగన్‌ హాజరయ్యే అవకాశం ఉండడంతో సోమవారం కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ సీతంపేటకు వచ్చారు. ముఖ్యమంత్రి పర్యటనకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించారు. మల్లి సీవోఈ పాఠశాల ఆవరణలో ఉన్న మైదానాన్ని, సీతంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానం, ఐటీడీఏ ఆవరణలో ఉన్న ఎన్‌టీఆర్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ స్టేడియాన్ని సందర్శించారు. ఎన్‌టీఆర్‌ గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియం,  ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం,  సీతంపేట కోడిరామ్మూర్తి గెస్ట్‌హౌస్‌ను అందుబాటులో ఉంచాలన్నారు. ఏర్పాట్లు పక్కాగా చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో ఐటీడీఏ పీవో బి.నవ్య, పాలకొండ డీఎస్పీ  ఎం.శ్రావణి, ఆర్‌డీవో హేమలత, ట్రైబుల్‌ వెల్ఫేర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ జి.మురళీ, ట్రాన్స్‌కో ఏడీఈ తిరుమలరెడ్డి, డీడీ నగేష్‌, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-02T05:15:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising