ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బే ప్రధానం

ABN, First Publish Date - 2022-12-12T04:21:12+05:30

రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బు తప్ప పర్యావరణ పరిరక్షణ పట్టడం లేదని ప్రముఖ పర్యావరణవేత్త, ‘వాటర్‌మన్‌ ఆఫ్‌ ఇండియా’గా పేరుగాంచిన డాక్టర్‌ రాజేంద్రసింగ్‌ విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పర్యావరణ పరిరక్షణ పట్టదు

రుషికొండను కాపాడాలని భగవంతుడిని కోరుకుంటున్నా

‘వాటర్‌మన్‌’ రాజేంద్రసింగ్‌ వెల్లడి

సాగర్‌నగర్‌ (విశాఖ సిటీ), డిసెంబరు 11: రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బు తప్ప పర్యావరణ పరిరక్షణ పట్టడం లేదని ప్రముఖ పర్యావరణవేత్త, ‘వాటర్‌మన్‌ ఆఫ్‌ ఇండియా’గా పేరుగాంచిన డాక్టర్‌ రాజేంద్రసింగ్‌ విమర్శించారు. ఆదివారమిక్కడ రోటరీ క్లబ్‌ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి వచ్చేముందు తాను రుషికొండ ఎదురుగాఉన్న ఆలయంలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నానని చెప్పారు. అక్కడి నుంచి రుషికొండపై జరుగుతున్న విధ్వంసాన్ని చూశానన్నారు. రాష్ట్ర పాలకులకు సరైన బుద్ధి కల్పించాలని, కోర్టు త్వరగా వీళ్లను శిక్షించి, రుషికొండ ప్రాంతాన్ని రక్షించాలని భగవంతుడిని కోరుకున్నట్టు తెలిపారు. సముద్రం మనిషికి జన్మనిచ్చిన తల్లి లాంటిదని, పర్యావరణాన్ని ధ్వంసం చేయడం మంచిది కాదని హితవుపలికారు. గత ప్రభుత్వ తప్పిదాలను వేలేత్తి చూపిన జగన్మోహన్‌రెడ్డి.. అధికారంలోకి వచ్చాక తానూ అదే తప్పు చేయడం సరికాదన్నారు. అనంతరం పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు గిరిజన మహిళలు థింసా నృత్యాన్ని ప్రదర్శించారు.

Updated Date - 2022-12-12T04:21:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising