ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kandukur: కందుకూరు మృతులకు బొరగం ఆర్థికసాయం

ABN, First Publish Date - 2022-12-30T19:26:26+05:30

నెల్లూరు జిల్లా కందుకూరు (Kandukur) మృతులకు పోలవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జీ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) ఆర్థిక సాయం ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంగారెడ్డిగూడెం (ఏటూరు జిల్లా): నెల్లూరు జిల్లా కందుకూరు (Kandukur) మృతులకు పోలవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జీ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) ఆర్థిక సాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు అందరికీ కలిపి లక్ష రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. టీడీపీ నేత నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టబోయే పాదయాత్ర సందర్భంగా బుట్టాయగూడెం క్యాంపు కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar) చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ‘యువగళం’ పోస్టర్‌ను బొరగం శ్రీనివాసులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ పాలనలో విసిగిపోయిన ప్రజల కోసం, నిరుద్యోగుల కోసం, కర్షకుల కోసం, కార్మికుల కోసం తనగళం వినిపించటానికి లోకేష్.. 400 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారని శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు తెల్లం వెంకటేశ్వరరావు, పసుమర్తి భీమేశ్వరరావు, నియోజకవర్గం వాణిజ్య విభాగం అధ్యక్షులు గుబ్బ రాంబాబు, ఐటీడీపీ ఏలూరు పార్లమెంట్ అధ్యక్షులు శావిలి సుభాష్ చంద్రబోస్, ఎస్సీ సెల్ రాష్ట్ర సోషల్ మీడియా కో ఆర్డినేటర్ మానెల్లి బాలు, ఐటీడీపీ పార్లమెంట్ అధికార ప్రతినిధి జల్లేపల్లి జితేంద్ర, ఎండపల్లి నాగు, చిక్కాల వెంకటేశ్వరావు, కొండే ఏసు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T19:42:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising