ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

11,26,350 మంది ఓటర్లు ఆధార్‌తో అనుసంధానం : కలెక్టర్‌

ABN, First Publish Date - 2022-10-26T00:07:43+05:30

జిల్లాలో పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటుచేసిన పాఠశాలల స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించి, నివేదిక అందజేయాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి ఎన్నికల అధికారులను ఆదేశించారు.

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రశాంతి, జేసీ మురళి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం, అక్టోబరు 25 : జిల్లాలో పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటుచేసిన పాఠశాలల స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించి, నివేదిక అందజేయాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి ఎన్నికల అధికారులను ఆదేశించారు. భీమవరం కలెక్టరేట్‌లో మంగళవారం ఎలకో్ట్రరల్‌ రోల్స్‌ స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌పై జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ఓటరు కార్డుకు ఆధార్‌ అనుసంధానంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి. జిల్లాలో 14,54,424 మంది ఓటర్లకు గాను 11,26,350 మంది ఆధార్‌ అనుసంధానం చేశారు. 7,30,467 మంది నుంచి సంతకం చేసిన ఫారం–6బి పొందారు. బూత్‌ లెవిల్‌ అధికారులకు నిర్ధేశించిన శిక్షణను కచ్చితంగా పూర్తి చేయాలి. ‘బూత్‌ లెవిల్‌ అధికారి ఎవరో తెలుసుకోండి’ అనే అంశంపై విస్తృత ప్రచారం చేయాలి. చనిపోయిన వారి వివరాలను సేకరించి నమోదు చేయడంతోపాటు, ఒకే ఓటు రెండుసార్లు నమోదు కాకుండా జాబితాలను పరిశీలించాలి. ప్రతీ పోలింగ్‌ స్టేషన్‌లో నవంబర్‌ 19, 20, డిసెంబరు 3, 4 తేదీల్లో ఓటర్ల నమోదు, తప్పొప్పుల సవరణకు ప్రత్యేక క్యాంపు నిర్వహించాలి’ అని సూచించారు.

Updated Date - 2022-10-26T00:07:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising