వైభవంగా హనుమద్వ్రతం
ABN, First Publish Date - 2022-12-06T00:14:31+05:30
భక్తి శ్రద్ధలతో ప్రజలు హనుమద్వ్రతం నిర్వహించారు. పట్టణంలోని ఆంజనేయస్వామి ఆలయాలు సోమవారం భక్తులతో కిటకిటలాడాయి.
ఆంజనేయుడికి అభిషేకాలు, పూజలు
భీమవరం టౌన్, డిసెంబరు 5: భక్తి శ్రద్ధలతో ప్రజలు హనుమద్వ్రతం నిర్వహించారు. పట్టణంలోని ఆంజనేయస్వామి ఆలయాలు సోమవారం భక్తులతో కిటకిటలాడాయి. మారుతీ టాకీస్ సెంటర్‌లోని దాసాంజనేయస్వామికి హంస వాహనంలో గ్రామోత్సవం నిర్వహించారు. స్వామివారికి అర్చకుడు ఘంటసాల భాస్కరశర్మ 108 లీటర్ల ఆవుపాలతో అభిషేకం చేశారు. అనంతరం తమలపాకులు, అరటిపండ్లతో పూజలు చేసి అలంకారం చేశారు. నర్స య్య అగ్రహారంలోని దాసాంజనేయస్వామికి విశేష పూజలు చేశారు. 108 కలశాలతో అభిషేకాలు నిర్వహించారు. ఇందులో భాగంగా హనుమాన్ పారాయణ బృందం నిర్వాహకురాలు చెరుకువాడ నిర్మల ఆధ్వర్యంలో మహిళలు 108 కలశాలతో గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకుడు వీరబాబు పూజలు చేసి అభిషేకాలు చేశారు. గు నుపూడిలోని సోమేశ్వరస్వామి ఉపాలయంలో దాసాంజనేయస్వామికి లక్ష తమలపాకుల పూజలు నిర్వహించారు. ఉదయంస్వామివారికి ఏకాదశ మన్యుసూక్త అభిసేకాలు చేశారు.
పాలకొల్లు అర్బన్: యడ్ల బజారులోని పంచముఖాంజనేయస్వామి ఆలయంలో అర్చకులు రమణ గురుస్వామి, ఎస్‌టిపి రఘుబాబు పూజలు నిర్వహించారు. కెనాల్ రోడ్డు లోని దాసోహాంజనేయ స్వామి ఆలయంలో అర్చకులు ఎం శ్రీనివాసాచార్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి గంధ సింధూరం, తమలపాకులతో ప్రత్యేకంగా స్వామివారిని అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.
Updated Date - 2022-12-06T00:14:33+05:30 IST