ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చలి పంజా

ABN, First Publish Date - 2022-11-21T00:39:26+05:30

చలిగాలుల తీవ్రత విపరీతంగా పెరిగింది. ఆదివారం ఉదయం నుంచి ఏలూరు జిల్లాతో పాటు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో భీకర చలిగాలులు వీస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా దక్షిణ కోస్తాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఉత్తర కోస్తాను ఆను కుని ఉన్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వాతావరణంలో పెను మార్పులు సంభవించాయి. ఈ కారణంగా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వణికిస్తున్న చలిగాలులు

వాతావరణంలో విభిన్న మార్పులు

ఆదివారం నుంచి మబ్బుల వాతావరణం

రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు

చలి గాలులు తట్టుకోలేక ప్రజలు విలవిల

ఏలూరుసిటీ, నవంబరు 20: చలిగాలుల తీవ్రత విపరీతంగా పెరిగింది. ఆదివారం ఉదయం నుంచి ఏలూరు జిల్లాతో పాటు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో భీకర చలిగాలులు వీస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా దక్షిణ కోస్తాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఉత్తర కోస్తాను ఆను కుని ఉన్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వాతావరణంలో పెను మార్పులు సంభవించాయి. ఈ కారణంగా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి జిల్లాలో మబ్బులతో కూడిన వాతావరణం కనిపించింది. సాధారణంగా నవంబరు మాసంలో చలి తీవ్రత పెరుగుతుంది. అయితే అల్ప పీడన ద్రోణి కారణంగా చలిగాలులు పెరగడంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. గతంతో పోలిస్తే ఈనెలలో చలి తీవ్రత విపరీతంగా పెరిగిందని, రోజురోజుకు ఉష్ణోగ్రతలు విపరీతంగా పడిపోతున్నాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. వాకింగ్‌ వెళ్లేవారు, తెల్లవారుజామున స్నానమాచరించే అయ్యప్పస్వాములు కూడా చలి తీవ్రతను తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. కార్తీక మాసం కావడంతో చాలామంది తెల్లవారుజామునే స్నానం ఆచరిస్తారు. చలితీవత్రను తట్టుకోలేక వేడి నీటితో చేస్తున్నట్టు పలువురు తెలిపారు. వేకువ జామున చేసుకునే పనులకు చలి అడ్డంకిగా మారింది. తెల్లారేసరికే పనుల్లో మునుగుపోయే వ్యవసాయ కూలీలు, రైతులు, పారిశుధ్య కార్మికులు, ఆకుకూరల దుకాణాలు, ఆటోవాలాలు, టీస్టాల్స్‌, టిఫిన్‌ సెంటర్‌ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రాత్రి సమయాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

పగటి పూట 29 నుంచి 34 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకు ఉష్ణోగ్రతలు నమోదైనా రాత్రి సమయాల్లో మాత్రం 17 నుంచి 21 సెంటీగ్రేడ్‌ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏలూరు జిల్లాలో ఈనెల 14 నుంచి 20 వతేదీ వరకు ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే ఇలా ఉన్నాయి. ఈనెల 14వ తేదీన 33/19(గరిష్ట/కనిష్ట) 15న 33/18, 16న 33/18, 17న 34/18, 18న 34/17, 19న 33/17, 20వ తేదీన 32/19 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతలు నమోద య్యాయి. దీనికితోడు తుపాను ప్రభావంతో చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

చలితో ఇబ్బందులు

చలితీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు రాత్రి సమయాల్లో ప్రయాణా లను రద్దు చేసుకుంటున్నారు. ఉదయం సమయంలో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో రహదారులపై జనసంచారం పూర్తిగా తగ్గింది. ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు పనులు చేయటానికి ఉదయం సమయంలో చలి ప్రభావం కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇప్పుడే ఇంత చలి ఉంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చలిని తట్టుకోవటానికి ఉన్ని దుస్తులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే ఏలూరు నగరంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నేపాల్‌ వారు ఉన్ని దుస్తుల దుకాణాలను నిర్వహిస్తున్నారు. వస్త్ర దుకాణాల్లో కూడా ఉన్ని దుస్తుల అమ్మకాలు పెరిగాయి.శాలువాలు, చలికోట్లు, జర్కిన్‌లు, మంకీ క్యాప్‌లు అమ్మకాలు పెరిగాయి. చలిని తట్టుకోవటానికి గ్రామీణ ప్రాంతాల్లో చలి మంటలు కాగుతున్నారు. పట్టణ శివారు ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చలిని తట్టుకోలేక వృద్ధులు, పిల్లలు నానా అవస్థలు పడుతున్నారు. టీ దుకాణాల్లో వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయని చెబుతున్నారు.

పగలే వణుకుతున్న ఏజెన్సీ

జంగారెడ్డిగూడెం : పశ్చిమ ఏజెన్సీ, మెట్ట ప్రాంతాల్లో చలి వణికిస్తోంది. ఉదయం 9 గంటలైనా చలి తగ్గడం లేదు. కిటికీలు, తలుపులు మూసుకుని ఇళ్లల్లో దాక్కున్నా వణుకు వదలడం లేదు. రాత్రయితే రోడ్లపై జనసంచారం కన్పించడం లేదు. రహదారుల్లో రాకపోకలు తగ్గాయి. ఎంతో అవసరం ఉంటేనే తప్ప రాత్రి వేళల్లో ఎవరూ బయటకు రావడం లేదు. ఇప్పుడే వర్జీనియా పొగాకు సాగు పనులు ప్రారంభ మయ్యాయి. తెల్లవారుజామునే పొలాలకు వెళ్లాల్సిన వ్యవసాయ కూలీలు, రైతులు ఇబ్బందులు పడుతు న్నారు. అలాగే వరిపంట చేతికొచ్చి ఇప్పుడు కోతలు ప్రారంభమయ్యాయి. తుఫాన్‌ భయంతో చలి సైతం పట్టించు కోకుండా పంట దక్కించుకు నేందుకు పరుగులు పెడుతున్నారు. చలి పంజాతో పనులన్నీ వెనుకబడుతున్నాయి.

Updated Date - 2022-11-21T00:48:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising