ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శివ నామస్మరణతో హోరెత్తిన శైవక్షేత్రాలు

ABN, First Publish Date - 2022-11-21T23:42:46+05:30

కార్తీక మాసం ఆఖరి సోమవారం శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆచంటేశ్వరుడి ఆలయం వేకువజాము నుంచి సాయంత్రం వరకు భక్తుల శివ నామస్మరణతో హోరెత్తింది.

ఆచంటేశ్వరుడికి పాలభిషేకం చేస్తున్న అర్చకుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆచంట, నవంబరు 21: కార్తీక మాసం ఆఖరి సోమవారం శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆచంటేశ్వరుడి ఆలయం వేకువజాము నుంచి సాయంత్రం వరకు భక్తుల శివ నామస్మరణతో హోరెత్తింది. వేకువజామునే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించి అనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఆలయ సన్నిధిలో ఉన్న కర్పూర జ్యోతిలో అనేక మంది భక్తులు ఆవు నెయ్యి వేశారు. గ్రామాల్లో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులకు ఆలయ అధికారి రాము, చైర్మన్‌ నెక్కంటి రామలింగేశ్వరరావు, సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.

వీరవాసరం: మండలంలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజాము నుంచి భక్తులు శివారాధన, అభిషేక పూజల్లో నిమగ్నమయ్యా రు. వీరవాసరంలోని విశ్వేశ్వర వీరేశ్వర దేవస్థానం, రాయకుదురు ఉమామూలేశ్వరస్వామి, మత్స్యపురి, కొణితివాడ, చింతలకోటిగరువు, ఆలయాలలో పూజలు చేశారు. రాయకుదరు ఉమామూలేశ్వరస్వామి ఆలయంలో లక్షబిల్వార్చన, గణపతిపూజ, పంచామృత అభిషేకాలు, రుద్రహోమం, చండీహోమం, 12 రకాల హారతులను స్వామివారికి ఇచ్చారు. అమ్మవారికి లక్ష కుంకుమార్చన పూజలు చేశారు. రాత్రి ద్వాదశ జ్యోతిలింగార్చన పూజలు చేశారు. వీరేశ్వర విశ్వేశ్వర ఆలయంలో లక్ష దీపోత్సవం నిర్వహించారు.

Updated Date - 2022-11-21T23:42:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising