ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాటు కోళ్లకు సంక్రాంతి డిమాండ్‌

ABN, First Publish Date - 2022-12-23T00:14:13+05:30

సంక్రాంతి వచ్చిదంటే చాలు జిల్లాలో కోడి పుంజలకే కాకుండా పెట్టలకు కూడా డిమాండ్‌ ఉంటుంది. జాతర మహోత్సవాలు ఎక్కువుగా సంక్రాంతి సమయంలోనే జరుగుతాయి. దూరప్రాంతాల్లో ఉన్న వారు పండుగ సమయాల్లో వచ్చి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకోవడం ఈ పండుగలో సర్వసాధారణం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెండు కేజీల కోడి రూ.3వేలు పైనే

అదీ ముందుగా అడ్వాన్స్‌ ఇస్తేనే..

నరసాపురం, డిసెంబరు 22: సంక్రాంతి వచ్చిదంటే చాలు జిల్లాలో కోడి పుంజలకే కాకుండా పెట్టలకు కూడా డిమాండ్‌ ఉంటుంది. జాతర మహోత్సవాలు ఎక్కువుగా సంక్రాంతి సమయంలోనే జరుగుతాయి. దూరప్రాంతాల్లో ఉన్న వారు పండుగ సమయాల్లో వచ్చి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకోవడం ఈ పండుగలో సర్వసాధారణం. ఎక్కువుగా ముక్కనుమ రోజునే అమ్మవారి ఆలయాల వద్ద కోళ్లు కోస్తుంటారు. నాటుకోళ్లనే మొక్కు ఇస్తుంటారు. దీంతో ఈసారి గ్రామదేవతలకు మొక్కులు తీర్చుకునేందుకు చాలా మంది ఇప్పటి నుంచే నాటుకోళ్ల కోసం గాలింపు మొదలుపెడుతున్నారు. దూర ప్రాంతాల్లో ఉంటూ స్వస్థలాలకు వచ్చే వారు కూడా బంధువులకు, స్నేహితులకు పోన్‌ చేసి కోళ్లను సిద్ధం చేయాలని కోరుతున్నారు. దీంతో నాటుకోళ్లకు ఒక్కసారిగా డిమాండ్‌ వచ్చింది. కేజీ కోడి రూ.2 వేలు పలుకుతోంది. అదే రెండు కేజీలు ఉంటే రూ.3 వేలుపైనే చెప్పుతున్నారు. అదే మూడు కేజీలు ఉంటే రూ.4 వేలకు ఉండాల్సిందే. అది కూడా ముందుగా అడ్వాన్స్‌ ఇస్తేనే ఉంచుతామని తేగేసి చెప్పుతున్నారు. దీంతో చాలామంది కోడిని చూసి కొంత మొత్తం అడ్వాస్స్‌ ఇచ్చి ఆ రోజున తీసుకెళ్లే విధంగా మాట తీసుకుంటున్నారు. జిల్లాలో పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే కోళ్ల పెంపకం ఎక్కువుగా ఉంటుంది. దీంతో చాలామంది గ్రామాల్లోని తమ చుట్టాలు, స్నేహితులకు ఫోన్‌ చేసి కోళ్ల గురించి ముందుగా అరా తీస్తున్నారు. ఉన్నాయని తెలిస్తే వెళ్లి ఒకే చేయించుకుంటున్నారు. దీంతో ఒక్కసారిగా నాటు కోళ్లకు డిమాండ్‌ వచ్చిపడింది.

Updated Date - 2022-12-23T00:14:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising