303 మంది వైద్య సిబ్బందికి షోకాజ్ నోటీసులు
ABN, First Publish Date - 2022-12-29T00:33:05+05:30
వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తోన్న వివిధ కేడర్ల ఉద్యోగుల్లో ముఖగుర్తింపు హాజరు (ఫేషియల్ రికగ్నిషన్ అటెం డెన్స్)ను హెల్త్ ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్‌లో వేయని కారణంగా ఉమ్మడి జిల్లాలో మొత్తం 303 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆ శాఖ ఉన్న తాధికారులు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.
ముఖ గుర్తింపు హాజరు వేయకపోవడమే కారణం
‘సర్దుబాటు’ ఉద్యోగులు డిప్యుటేషన్ స్థానాల్లో
బయో మెట్రిక్ వేయాల్సిందే
ఏలూరు ఎడ్యుకేషన్, డిసెంబరు 28 : వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తోన్న వివిధ కేడర్ల ఉద్యోగుల్లో ముఖగుర్తింపు హాజరు (ఫేషియల్ రికగ్నిషన్ అటెం డెన్స్)ను హెల్త్ ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్‌లో వేయని కారణంగా ఉమ్మడి జిల్లాలో మొత్తం 303 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆ శాఖ ఉన్న తాధికారులు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు జిల్లాలోని పీహెచ్‌సీల మెడికల్ ఆఫీసర్లు, డీడీవోలు చర్యలు తీసుకోవాలని డీఎం హెచ్‌వోలకు సూచించారు. ముఖ గుర్తింపు హాజరును తొలుత విద్యాశాఖ, తదుపరి వైద్య ఆరోగ్యశాఖలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం హాజరును సంబంధిత ఉద్యోగులంతా విధిగా వేసేలా ఒకింత కఠినంగా వ్యవహరించనుందని తాజా పరిణామాలు ఓ సంకేతంగా భావిస్తున్నారు. ఈ నెల 27న ఉమ్మడి జిల్లాలో హాజరు వేయని పీహెచ్‌సీల ఉద్యోగుల పేర్లతోసహా వివరాలను జిల్లాకు పంపి, వారికి షోకాజ్ నోటీసులు జారీచేయాలని ఆదేశించారు. ఆ వివరాల ప్రకారం ఏలూరు జిల్లాలో 209 మంది, భీమవరం కేంద్రంగా వున్న పశ్చిమ గోదావరి జిల్లాలో 94 మంది ముఖగుర్తింపు హాజరును వేయలేదని తేల్చారు. వీరిలో పలువురు ఇటీవల ఆయా పీహెచ్‌సీల నుంచి సర్‌ప్లస్ ఉద్యోగులుగా కొరత వున్న పీహెచ్‌సీలకు డిప్యూటేషన్లపై సర్దుబాటు అయిన వారున్నట్లు సమా చారం. అలాగే ముఖాధారిత హాజరు శాతాన్ని పెంచడానికి కృషి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో హాజరు వేయని ఉద్యోగులకు గురు వారం జిల్లావైద్య ఆరోగ్యశాఖ షోకాజ్ నోటీసులు జారీచేసే అవకాశం ఉంది.
ఆ..స్థానాల్లో హాజరు వేయకపోతే జీతం కట్
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీ) అదనంగావున్న వివిధ కేడర్ల వైద్య సిబ్బందిని కొరతవున్న పీహెచ్‌సీలు, సచివాలయాలకు తాత్కాలికంగా డిప్యూ టేషన్లపై సర్దుబాటు చేయగా, వారంతా ప్రస్తుతం పనిచేస్తోన్న డిప్యూటేషన్ స్థానాల్లోనే ఫోటో ఆధారిత ముఖగుర్తింపు హాజరువేయాలని వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇలా సర్దుబాటు స్థానాల్లో పనిచేస్తున్న వారంతా ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ వేయకపోతే వారికి జీతాల్లో కోత విధించడంతో పాటు, షోకాజ్ నోటీసులు జారీచేయాలని ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు సమాచారం పంపారు. జిల్లావ్యాప్తంగా ఇటీవల పలు పీహెచ్‌సీల్లో సర్‌ప్లస్‌గా వున్న వైద్య ఉద్యోగులను వివిధ పీహెచ్‌సీలకు, సచి వాలయాలకు ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్‌లో భాగంగా సర్దుబాటు చేయగా వీరిలో కొందరు ముఖగుర్తింపు హాజరును వేయడం లేదని ఉన్నతాధికారులకు సమాచారం అందటంతో ఆ మేరకు తాజాగా ఆదేశాలు జారీచేశారు. జిల్లాలో ఇటువంటి ఉద్యోగులు ఎంతమంది వున్నారో జిల్లా వైద్యఆరోగ్య శాఖ ఆరా తీయడం ప్రారంభించింది.
Updated Date - 2022-12-29T00:33:07+05:30 IST